కోల్బెల్ట్, వెలుగు : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్వేతనం రూ.18వేలను చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే కల్పించాలని మాజీ విప్ నల్లాల ఓదెలు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. మందమర్రిలో ఆశా వర్కర్స్చేపట్టిన దీక్షా శిబిరానికి తన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. జాబ్ఛార్ట్ను విడుదల చేయాలని, పనిభారం తగ్గించాలన్నారు. ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరారు.
ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సమ్మెలో భాగంగా సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్కమిటీ మెంబర్ దూలం శ్రీనివాస్ నేతృత్వంలో ఆశా వర్కర్లు ర్యాలీగా ఇంటింటికి వెళ్లి స్థానికులు, బీఆర్ఎస్ లీడర్లను కలిసి పూలు అందిస్తూ తమ పోరాటానికి మద్దతు కోరారు. ఆశా వర్కర్ సంఘం బాధ్యులు కవిత, సబిత, లక్ష్మి, శ్యామల, రాధ, రూప, మంజుల, స్వరూప తదితరులు పాల్గొన్నారు.