- సేల్స్, మార్కెటింగ్, టెక్ ఉద్యోగాలకు డిమాండ్
- ఇన్ డీడ్ హైరింగ్ ట్రాకర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వైట్ కాలర్ జాబ్స్‌కు డిమాండ్పెరుగుతోందని ఇండ్ హైరింగ్ ట్రాకర్ తాజాగా వెల్లడించింది. 2024 ఏప్రిల్– జూన్ మధ్య మనదేశపు వైట్ కాలర్ జాబ్ మార్కెట్‌ను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కాలంలో 73శాతం యజమానులు నియామకాలు చేపట్టారు. 2024 జనవరి–- మార్చి నాటికి ఇది 7శాతం పెరిగింది. సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలు యాజమాన్యాలకు కీలకంగా మారాయి. వీటికి డిమాండ్ పెరిగింది.
సేల్స్‌లో 30శాతం, మార్కెటింగ్‌లో 23శాతం నియామకాలు ఉన్నాయి. కంపెనీలు తమ మార్కెట్ ఉనికిని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, ఈ ఉద్యోగాలు వ్యాపారాన్ని నడపడానికి కీలకమైనవిగా మారాయి. నియామకాల్లో డేటా అనలిస్ట్‌లు (23శాతం), డేటా ఇంజనీర్లు (16శాతం), డేటా సైంటిస్టులు 11శాతం ఉన్నారు.