హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా-కు వైట్ ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్ మ్యాచ్

  •     జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6న జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 
  •     ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: హిస్టారికల్ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌లో భాగంగా ఇండియా, కువైట్ మధ్య జూన్ 6న జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంనుంచి క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినట్టు తెలంగాణ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) సెక్రటరీ గణపతి పాల్గుణ మంగళవారం తెలిపారు.

ఈ హిస్టారికల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆలిండియా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తెలంగాణకు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన అనుమతుల గురించి టీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ప్రెసిడెంట్ కేటీ మహితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు వెల్లడించారు. మాజీ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ ప్లేయర్ అయిన సీఎం వెంటనే ఒప్పుకున్నారని తెలిపారు. దాంతో మ్యాచ్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి స్పోర్ట్స్ అథారిటీకి కన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. అదే విధంగా తెలంగాణలోని అన్ని  స్టేట్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్లకు ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించగా సీఎం సానుకూలంగా స్పందించారని పాల్గుణ తెలిపారు.

ALSO READ: తొమ్మిదోసారి అండర్‌‌‌‌‌‌‌‌-19 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా