PM Modi US tour: చైనాపై టారిఫ్ విధిస్తూనే.. ఇండియాకు ఆహ్వానం.. ట్రంప్-మోదీల వ్యూహమేంటి..?

PM Modi US tour: చైనాపై టారిఫ్ విధిస్తూనే.. ఇండియాకు ఆహ్వానం.. ట్రంప్-మోదీల వ్యూహమేంటి..?

ట్రంప్ వ్యూహాలపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ముందే చెప్పినట్లుగా కెనడా, మెక్సికో, చైనా దేశాలపై ఎడా పెడా టారిఫ్ లు విధించారు. ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ దేశాలలో అలజడి మొదలైంది. ఫ్రీట్రేడ్ (స్వేచ్ఛా వాణిజ్యం) కు అంతరాయం కలుగుతుందని ఆందోళన చెందాయి. మెక్సికో, కెనడాలతో పాటు చైనా కూడా యూఎస్ పై పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచ దేశాలలో తయారీ రంగంలో ముందున్న చైనాపై సుంకం విధించిన అమెరికా.. ఇండియా విషయంలో అంత కఠిన నిర్ణయం తీసుకోలేదు. భారత్ పై కూడా పన్ను పోటు తప్పదని అన్ని దేశాలు భావించినా.. అది జరగక పోగా అమెరికా పర్యటనకు రావాలని భారత ప్రధాని మోదీని ఆహ్వానించడంతో చైనా సహా ఇతర దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. 

Also Read :- అమెరికా వస్తువులపై 15 శాతం ట్యాక్స్

అమెరికా అధ్యక్షునిగా గెలిచిన తర్వాత జనవరి 27న ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్.. తమ దేశం రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అక్రమ వలసలు, అమెరికా నుంచి మరిన్ని రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఫోన్ లో చర్చించారు ఇరు నేతలు. ఆ తర్వాత మోదీ ఎక్స్ లో ‘‘డియర్ ఫ్రెండ్’’ అని సంబోధిస్తూ.. ఇరు దేశాల అభ్యున్నతికి సంబంధించి కలిసి నిర్ణయం తీసుకుందామని మోడీ పేర్కొన్నారు. దీంతో తాజాగా ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న అమెరికా పర్యటనకు వస్తున్నారని వైట్ హౌజ్ ప్రకటించడంతో.. ఒకవైపు ట్రేడ్ వార్ నడుస్తున్న క్రమంలో.. మోదీ టూర్ ఎలా ఉండనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

మోదీ యూఎస్ ట్రిప్కు సంబంధించిన విశేషాలు:

  • అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఫిబ్రవరి13న ట్రంప్ ను కలుస్తారు. మోదీకి విందు ఏర్పాటు చేయనున్నారు ట్రంప్
  • ఫ్రాన్స్ పర్యటన అనంతరం ఫిబ్రవరి 12న వాషింగ్టన్ చేరుకుంటారు. ఫిబ్రవరి 14 వరకు అక్కడే ఉంటారు. 
  • ఇండియాకు యూఎస్ అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ అయనందున, వాణిజ్య సంబంధిత విషయాలు, విసా నిబంధనలపై చర్చిస్తారు. ఇరు దేశాల మధ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 118 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగటం గమనార్హం.
  • ఇండియా నుంచి దిగుతమ చేసుకుంటున్న వస్తువులపై కస్టమ్ డ్యూటీ తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ అంగీకరించారు. ఇరు దేశాలకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం
  • అక్రమ వలస దారులపై ఇప్పటికే మోదీతో మాట్లాడారు ట్రంప్. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే అక్రమ వలసదారులను ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 
  • ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారం, ఒప్పందాలను చేసుకోనున్నారు. 
  • ఇరు దేశాల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. యూఎస్ రక్షణ సామాగ్రిని దిగుమతి చేసుకోవడంలో ఇండియాకు సహకరిస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.
  • ఇండియాపై టారిఫ్ విషయంలో ట్రంప్ తో మోదీ చర్చిస్తారని అధికారిక వర్గాల సమాచారం.
  • అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ కు సహకారం అందించాలని ట్రంప్ ను కోరనున్నారు మోదీ. 
  • ఇండియాను చైనాకు ప్రత్యామ్నాయంగా ట్రంప్.. అందుకు సహకరిస్తారని అధికారిక వర్గాలు అంటున్నాయి.