డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌కి దగ్గరైన శివ కార్తికేయన్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ‘ప్రిన్స్’. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు, తమిళ బైలింగ్వల్‌లో ఉక్రెయిన్ నటి మరియా రయబోషాప్కా హీరోయిన్. సునీల్ నారంగ్, సురేష్‌బాబు, పుస్కూరు రామ్మోహన్ రావు కలిసి నిర్మించారు. అక్టోబర్ 21న సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచిన మేకర్స్ ఆల్రెడీ రెండు సాంగ్స్‌ని, టీజర్‌ని విడుదల చేశారు. నిన్న మరో పాటను వదిలారు.
‘గుండెలోన పెట్టుకుని ప్రేమించాను.. నువ్వు కోపగించుకున్నావంటే తట్టుకోలేను.. బుజ్జగించుకుందామని చేశా ఫోన్.. నా ఫోన్ తీసి హూ ఆర్ యూ అని అన్నావ్ నన్ను.. అయ్యో నేనెవరు.. హే హూ యామ్ ఐ’ అంటూ సాగిన ఈ మాస్ బీట్ ఆకట్టుకుంటుంది. తమన్ కంపోజ్ చేసిన పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. దినకర్ కలవల ఎనర్జిటిక్‌గా పాడాడు. శాండీ కొరియోగ్రఫీలో శివ కార్తికేయన్ వేసి సింపల్ స్టెప్స్ ఇంప్రెస్ చేశాయి.