ఢిల్లీ వెళ్లొచ్చిన మరో 13 మంది మిస్సింగ్

ఢిల్లీ వెళ్లొచ్చిన మరో 13 మంది మిస్సింగ్

ఆ13 మంది ఎక్కడ?

ఖమ్మం ఐసోలేషన్ వార్డులో 10 మంది

గాంధీ హాస్పిటల్లో ఇద్దరు.. చెస్ట్ ఆస్పత్రిలో మరొకరు

లభించని మిగిలిన వారి అడ్రస్

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇంత వరకూ కరోనా పాజిటివ్ కేసులు రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న జనాన్ని కొందరు ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం టెన్షన్ పెడుతోంది. జిల్లా నుంచి మొత్తం 27 మంది ఢిల్లీ మర్కజ్ వెళ్లారని సమాచారం ఉంది. అయితే 26 మంది మాత్రమే వెళ్లారని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. వారిలో ఇంత వరకు 10 మందిని మాత్రమే ఖమ్మం లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించగా, మిగిలిన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితా ప్రకారం అందరినీ ఐసోలేషన్ సెంటర్లకు తరలించేందుకు ఆఫీసర్లు ప్రయత్నించారు. కానీ కొంత మంది సమాచారం లభించకపోవడం కొంత కలవర పెడుతోంది. ప్రభుత్వం నుంచి అందిన సమాచారంతో ఆదివారం రోజే ముస్లిం మత పెద్దలను ఆఫీసర్లు సంప్రదించారు. వారిచ్చిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి 10 మందిని జిల్లా వైద్య శాఖ ఆఫీసర్లు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మిగిలిన వారిలో ఇద్దరు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నట్టు సమాచారం రాగా, మరొకరు హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రిలో ఉన్నారు. మిగిలిన 13 మంది ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు. దీంతో వారిని గుర్తించేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారిలో కొందరు హైదరాబాద్ లో సెటిల్ కావడంతో అక్కడే ఉన్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సహా, రాష్ట్ర వైద్య శాఖ ఆఫీసర్లకు జిల్లా ఆఫీసర్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాగా వారు అక్కడే ఉన్నారా? లేదా? అనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జిల్లాలో బుధవారం వరకు విదేశాల నుంచి వచ్చిన 543 మందిని ఆఫీసర్లు గుర్తించారు. వారిలో 525 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. 18 మంది ప్రభుత్వ ఆధ్వర్యంలో స్పెషల్ క్వారంటైన్లో ఉన్నారు. 824 మంది గవర్నమెంట్హాస్పిటల్లో కరోనా అనుమానిత లక్షణాలతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. 119 మంది ఇన్ పేషెంట్లుగా చేరి ట్రీట్మెంట్ పొందారు. 46 మంది మమత హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో ఉండగా, ఇప్పటి వరకు 111 మంది శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకు పంపించారు. వారిలో 100 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా, 11 మంది రిపోర్టులు రావాల్సి ఉందని డీఎంహెచ్వో మాలతి తెలిపారు.

For More News..

కరోనా దెబ్బకు దిగొచ్చిన బంగారం

3 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు.. మీ బండి ఉందేమో చెక్ చేసుకోండి..

కరోనా ఎఫెక్ట్: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇవి ఉండాల్సిందే

కరోనా చావులతో రికార్డుకెక్కిన అమెరికా.. ఒక్కరోజులోనే..