కరోనా పోవాలంటే కలసి పోరాడాలె

జెనీవా: కరోనా సంక్షోభం అంతమైందని అనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త వేరియంట్ వల్ల కలిగే తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వేగంగా వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరినీ ఓ ప్రశ్న తొలచివేస్తోంది. కరోనా ఎప్పుడు అంతమవుతుంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ స్పందించారు. కరోనాకు అంతం తప్పదన్న ఆయన.. ఇందుకు కోసం దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఇదే జరిగితే 2022లోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. 

కరోనా టీకాలు పోగేసుకునేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడ్డొదని టెడ్రోస్ అన్నారు.   జాతీయవాదం పేరిట ఓ గిరిగీసుకుని అందులోనే ఉండిపోవద్దని ప్రపంచ దేశాలకు సూచించారు. నూతన సంవత్సర వేడుక సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో టెడ్రోస్ ఈ విషయాలను వెల్లడించారు. టీకాల లభ్యతలో వివిధ దేశాల మధ్య నెలకొన్న అసమానతల కారణంగా కరోనా మరిన్ని మార్పులు సంతరించుకుని కొత్త వేరియంట్లు ఉనికిలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఏఆర్ రెహ్మాన్కు కాబోయే అల్లుడు ఎవరంటే..?

రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ హఫీజ్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మృతి