మెక్సికోలో ఈ ఏడాది ఏప్రిల్ లో బర్డ్ ఫ్లూ రోగి మృతిచెందాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది. జ్వరం, అతిసారం, వికారం లక్షణాలతో బాధపడుతూ మరణించాడని తెలిపింది.ఒక వ్య క్తి బర్డ్ ఫ్లూతో చనిపోవడం ప్రపంచంలో మొదటసారి అని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ప్రజలకు బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని WHO తెలిపింది.
మెక్సికో స్టేట్ లోని 59 ఏళ్ల వ్యక్తి జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం వంటి లక్షణాలతో మెక్సికో నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరగా.. అతడిని పరీక్షించిన వైద్యులు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. అతడు ఏప్రిల్ 24న చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన వ్యక్తికి A(H5N2) వైరస్ సోకినట్టు తేల్చారు డాక్టర్లు. ఇది మెక్సికోలోని పౌల్ట్రీల్లో కోళ్లకు ఎక్కువగా ఉంటుందని WHO ఓ ప్రకటనలో తెలిపింది.
WHO తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్ ఫ్లుయెంజాA(H5N2) వైరస్ మానవులకు సోకినట్టు ప్రయోగపూర్వంగా నిర్ధారణ జరిగింది. బాధితులకు పౌల్ట్రీ, ఇతరు జంతువులతో సంబంధాలు లేకపో యిన ప్పటికీ.. బర్డ్ ఫ్లూ వైరస్ తో దాదాపు మూడు వారాలపాటు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు WHO తెలిపింది.