- ఆరు వారాల్లో కేసులు డబుల్ అయ్యాయని ఆందోళన
- వచ్చేవారం ఎమర్జెన్సీ కమిటీ వేస్తామని ప్రకటన
న్యూయార్క్: ప్రపంచ చరిత్రలోనే కరోనా వ్యాధి సీరియస్హెల్త్ఎమర్న్సీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చెప్పింది. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆరు సార్లు గ్లోబల్ హెల్త్ఎమర్జెన్సీలను ప్రకటించారని, అందులో కరోనానే తీవ్ర మైనదని ప్రకటించింది. సోమవారం డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రియేసస్ కరోనాపై మీడియాతో మాట్లాడారు. జనవరి 30న కరోనాను హెల్త్ ఎమర్న్సీగా ప్రకటించామని, మరో రెండు రోజుల్లో దానికి ఆరు నెలలు నిండుతాయని ఆయన అన్నారు. ఇప్పటిదాకా కోటీ 60 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆరున్నర లక్షల మంది దాకా చనిపోయారని చెప్పారు. అయితే, ఆరు వారాల్లోనే కేసులు రెట్టింపయ్యా యని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కరోనాను హెల్త్ఎమర్జెన్సీగా ప్రకటించిన జనవరి 30న చైనా అవతల కేవలం 100 కేసులే ఉన్నాయని, మరణాలేవీ లేవని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కరోనా మరింత తీవ్ర రూపం దాల్చిందన్నారు. అందుకే కరోనా మహమ్మారిపై స్టడీ చేసేందుకు వచ్చే వారంలో ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీ సూచనలకు తగ్గట్టు చర్యలు తీసుకుంటామని వివరించారు.
వాటిని ఫాలో అయిన దేశాలు బాగున్నయ్
కరోనా మహమ్మారిని అణచేసేందుకు మాస్కులు పెట్టుకోవడం, ఎడం పాటించడం, చేతులను తరచూ కడుక్కోవడం, గుమిగూడకుండా ఉండడం వంటివే అసలైన మందులని డబ్ల్యూహెచ్వో చీఫ్ ఘెబ్రియే సస్ అన్నారు. అంతేగాకుండా పాజిటివ్లు వారి కాంటాక్ట్ లను గుర్తించడం, ఐసోలేట్ చేయడం, టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చినోళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, క్వారంటైన్ చెయ్యడం వంటి వాటితోనే కరోనా వ్యాప్తిని తగించేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అస్త్రాలన్నారు. వాటిని పక్కాగా పాటించిన దేశాల్లో ఇప్పటికే కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చిందన్నా రు. కాంబోడియా,న్యూజీలాండ్, రవాండా, థాయ్లాండ్, వియత్నాం,పసిఫిక్–కరీబియన్లోని దీవులు ఆ ఫార్ములాతోనే సక్సెస్ అయ్యాయని గుర్తు చేశారు. కెనడా, జర్మనీ,సౌత్ కొరియా, చైనా వంటి దేశాలు ఆ ఫార్ములాను ఫాలో అయ్యే తీవ్రంగా ఉన్న కరోనాను కంట్రోల్ చేశాయన్నారు.