న్యూఢిల్లీ: పరిగెత్తడంలో పోలికకు చిరుతనే ఉదాహరణగా తీసుకుంటాం. చిరుత వేగం అలాంటిది మరి. పరుగెత్తడంలోనే కాదు వేటాడంలోనూ, పోరాడటంలోనూ చిరుతకు ఏదీ సాటి రాదనేది ఈ వీడియోను బట్టి చెప్పొచ్చు. ప్రమాదకర కొండచిలువ తలను చిరుత మింగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 49 సెకన్ల ఈ వీడియోలో పైథాన్‌పై చిరుత అటాక్ చేసింది. మెళ్లిగా ముందుకెళ్తూ తన పంజాతో కొండచిలువపై చిరుత విరుచుకుపడింది. అకస్మాత్తు దాడితో షాకయిన పైథాన్ చిరుత నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. అయినా చిరుత తన పట్టును నిలుపుకొని పైథాన్‌ను నోట్లో పెట్టుకొని చంపేసింది. వీడియో చివర్లో పైథాన్ తలను నోట్లో పెట్టుకొని చిరుత వెళ్తుండటాన్ని చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎక్కడైనా మనుషులనో లేదా జంతువులను మింగిన కొండ చిలువను చూశాం గానీ ఇదేంటి, పైథాన్‌ను చిరుత మింగడం అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్పీడ్ చాలా ముఖ్యమని, ఈ చిరుతను పెంచుకోవాలని ఉందంటూ ఇంకొందరు నెటిజన్స్ సరదా కామెంట్లు పెడుతున్నారు.
leopard attacks a python! ?? pic.twitter.com/RCqM6SM9Xo
— Nature is Scary (@AmazingScaryVid) October 12, 2020