రోహిత్ శర్మ​ తర్వాత ఎవరు?

రోహిత్ శర్మ​ తర్వాత ఎవరు?

న్యూఢిల్లీ: రోహిత్​ శర్మ కెప్టెన్సీ ముగిసిన తర్వాత ఫార్మాట్లకు అనుగుణంగా మూడేళ్ల  లీడర్​షిప్​ ప్లాన్​ ఎలా ఉండాలి? మూడు ఫార్మాట్లలో నెక్స్ట్​​ జనరేషన్​కు పనికొచ్చే స్పిన్నర్లు ఎవరు? 2022 అండర్​–19 వరల్డ్​కప్​ విన్నింగ్​ టీమ్​ నుంచి నేషనల్​ టీమ్​కు అప్​గ్రేడ్ అయ్యే సత్తా ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? పంత్ ప్లేస్​లో కేఎస్​ భరత్​ కాకుండా టెస్ట్​ టీమ్​లోకి వచ్చే కీపర్​ ఎవరైనా ఉన్నాడా?  సెలెక్షన్​ కమిటీ అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన ఇంటర్వ్యూలో అశోక్​ మల్హోత్రా నేతృత్వంలోని సీఏసీ అడిగిన ప్రశ్నలు ఇవి.

టీ20 వరల్డ్​కప్ తర్వాత సెలెక్షన్​ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. కేవలం చేతన్​ శర్మను మాత్రమే కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త సెలెక్టర్ల కోసం సీఏసీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన ఇంటర్వ్యూకు చేతన్​ శర్మతో పాటు హర్విందర్​ సింగ్​ హాజరయ్యాడు. ఇంటర్వ్యూలకు  అప్లై చేసిన వారిలో సీఏసీ  13 మందిని షార్ట్​ లిస్ట్​ చేసింది.  అయితే ఇందులో వెంకటేశ్​ ప్రసాద్​ పేరు లేకపోవడం గమనార్హం.