ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5వికెట్లు తీసిన ముంబై ఇండియన్స్ మీడియం పేసర్ ఆకాశ్ మద్వాల్ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1993 లో ఉత్తరాఖాండ్ లో జన్మించాడు ఆకాశ్ మద్వాల్. ఇతను టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పక్కింట్లోనే ఉండేవాడు. రిషబ్ పంత్ తో పాటుగా ఇతను అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు.
ఇంజనీరింగ్ చదివిన ఆకాశ్ మద్వాల్ కొన్నిరోజులు ఇంజనీర్ గా పనిచేశాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి క్రికెట్ పై ఫోకస్ పెట్టాడు. 2019లో తొలిసారి ముస్తాక్ ఆలీ ట్రోఫి ఆడేందుకు ఉత్తరాఖాండ్ నుంచి ఎంపికయ్యాడు. 2022 వేలంలో ఇతడిని ఎవరూ తీసుకోలేదు. సూర్యకుమార్ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాష్ మద్వాల్ ని జట్టులోకి తీసుకుంది ముంబై.
ఉత్తరాఖాండ్ నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్ ఆకాష్ కావడం విశేషం. రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కి అతడిని అట్టిపెట్టుకుంది. మధ్వాల్ ఆడింది ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లే. కానీ ముంబయి క్వాలిఫయర్స్-2 వరకు రావడంలో మధ్వాల్ కీలకపాత్ర పోషించాడు. లీగ్ దశలో సన్‌రైజర్స్‌తో చివరి మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన అతడు.. 5 వికెట్లతో ఎలిమినేటర్‌లో లక్నో పనిపట్టాడు.
ఈ ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన మద్వాల్ 13 వికెట్లు తీశాడు. . టీమిండియాకు భవిష్యత్తులో మరో బంగారం లాంటి బౌలర్ దొరికేశాడని నెటిజన్లు భావిస్తున్నారు.