DeepSeek AI: డీప్ సీక్ అంటే అమెరికాకు భయమా..ఎందుకు?

DeepSeek AI: డీప్ సీక్ అంటే అమెరికాకు భయమా..ఎందుకు?

డీప్ సీక్..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..వచ్చీ రావడంతో అమెరికా స్టాక్ మార్కెట్ను గడగడలాడించింది. యూఎస్ టెక్ స్టాక్ లను భారీగా అమ్ముకోవాల్సి వచ్చింది. డీప్ సీక్ దెబ్బకు అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఎన్విడియా, ఒరాకిల్ తో సహా అనేక మంది బిలియనీర్లు భారీ నష్టాలను చవిచూశారు. చైనాకు చెందిన కపెంనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అయిన డీప్ సీక్.. అమెరికా మార్కెట్లో అడుగు పెట్టడంతో అమెరికాకు దడ పుట్టించింది.. 

U.S. స్టాక్ మార్కెట్‌ను కుదిపేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ డీప్‌సీక్‌ను 40 ఏళ్ల లియాంగ్ వెన్‌ఫెంగ్ అనే వ్యాపారవేత్త స్థాపించారు. మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయిన అతను AI పరిశ్రమలో యూఎస్ కు ధీటుగా చైనాను నిలిపేందుకు తాను టెక్‌ రంగంలోకి  మారినట్లు లియాంగ్ చెబుతున్నాడు. లియాంగ్ 2023లో డీప్‌సీక్‌ను స్థాపించారు. చైనా ఎన్‌విడియా చిప్‌లను పొందలేని పరిస్థితుల్లో ప్రాసెసర్‌ల అవుట్‌పుట్‌ను కొరత తీర్చేందుకు డీప్ సీక్ ను ఏర్పాటు చేశారు. 

కీలక నేపథ్యం..

డీప్‌సీక్ ఉత్పాదక AI మోడల్ రిలీజ్తో USలోని టెక్ స్టాక్‌లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ప్రముఖ చిప్ కంపెనీ అయిన ఎన్విడియా దాదాపు 600 బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవి చూసింది. ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్‌కు 27.6 బిలియన్ డాలర్లు, ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్‌కు 20.8 బిలియన్ డాలర్ల నష్టాలతో సహా అనేక మంది బిలియనీర్లు స్టాక్ మార్కెట్ కుదేలవడంతో తమ సంపదను కోల్పోయారు. 

కంపెనీ మోడల్ OpenAI  డీప్ సీక్..చాట్‌బాట్ ChatGPTకి ప్రత్యర్థిగా గట్టి పోటీనిచ్చింది. డీప్ సీక్ ను అమెరికా అధ్యక్షుడు కూడా మెచ్చుకోక తప్పలేదు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాడక్టుల కంటే డీప్ సీక్ తక్కువ ఖర్చుతో అభివృద్ది చేయబడిందని ట్రంప్ ప్రశంసించారు. 

ఎవరీ లియాంగ్ ?

లియాంగ్..1980లో చైనాలోని గ్వాంగ్ డాంగ్ లో జన్మించిన ఓ టీచర్ కొడుకు. జెజియాంగ్ యూనివర్సిటీ నుంచి ఇన్ ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో  మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. 2015లో లియాంగ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ రూపొందించే కంపెనీ హైఫ్లైయర్ ను కోఫౌండర్ గా స్థాపించారు. ఇది మ్యాథ్య్, AI ఆధారంగా పనిచేసే హెడ్జ్ ఫండ్. 

2016 అక్టోబర్ లో హైఫ్లైయర్ తన మొదటి AI మోడల్ ను సృష్టించింది. గతంలో సాంప్రదాయ మెషీన్-లెర్నింగ్ అల్గారిథమ్‌లపై ఆధారపడి AI అంచనాల ఆధారంగా కంపెనీ తన మొదటి స్టాక్ పొజిషన్‌ను సూచించేది. ఈ కంపెనీ 2017 నాటికి దాదాపు అన్ని స్టాక్ స్థానాలను అభివృద్ధి చేయడానికి AI మోడళ్లను ఉపయోగించడం ప్రారంభించింది. ఆ తర్వాత హెడ్జ్ ఫండ్ AI అల్గారిథమ్‌లు ప్రాథమిక అనువర్తనాలకు పరిశోధన బృందాన్ని నియమించింది.

ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం.. లియాంగ్ 2021 కంటే ముందు అమెరికాకు చెందిన ఎన్విడియా గ్రాఫిక్స్ ప్రాసెసర్ చిప్ లను ఇంపోర్ట్ చేసుకునేవారు. అయితే 2021 తర్వాత బైడెన్ ప్రభుత్వం  చైనా ఆంక్షలతో ఆ చిప్ బిజినెస్ ను  పరిమితం చేయబడింది. 

డీప్‌సీక్ అంటే..

డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..1.4 మిలియన్ల పెట్టుబడితో లియాంగ్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ డీప్ సీక్(DeepSeek). 2025 జనవరిలో యూఎస్ లో యూజర్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఓపెన్ సోర్స్ మోడల్ లను విడుదల చేసింది ఈ కంపెనీ. ప్రారంభించిన తక్కువ సమయంలో ఐఫోన్ డౌన్ లోడ్ లు పెద్ద ఎత్తున జరిగాయి. ఎంతలా అంటే.. Open AI చాట్ జీపీటీ కంటే ఎక్కువ డౌన్ లోడ్లతో డీప్ సీక్ మొదటి స్థానంలో నిలిచింది. 

డీప్ సీక్ ప్రస్తుతం R1, V3 AI మోడల్ లను అందిస్తుంది. ఇవి పనితీరులో బెంచ్ మార్క్ ప్రత్యర్థి మోడల్స్ కంటే మెరుగ్గా ఉన్నాయి లియాంగ్ చెబుతున్నారు. Open AI, Meta ఏఐ మోడల్స్ తో పోల్చితే.. మోడల్స్ కు ట్రైనింగ్, డెవలప్ మెంట్ కు తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా ఉంటాయని  చెప్పారు.  అమెరికా చిప్ మేకర్లు, AI సంస్థల కంటే తక్కువ ఖర్చుతో దాని మోడల్ ను అభివృద్ది చెసినట్లు కంపెనీ చెబుతోంది. 

పనితీరులో డీప్‌సీక్ R1 ,V3 మోడల్‌లను దాని టాప్ 10 ఉత్పత్తులలో నిలిపింది. OpenAI, Google ,Elon Musk's xAI చే అభివృద్ధి చేయబడిన కొన్ని నమూనాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఎన్‌విడియా అభివృద్ధి చేసిన చిప్‌లయాక్సెస్ లేకపోవడంతో AIలో డీప్‌సీక్ కంపెనీ పురోగతి పరిమితంగా ఉందని లియాంగ్ చెబుతున్నారు.