కోటీశ్వరుడైనా బిచ్చగాడు : అడుక్కున్న డబ్బులతో అపార్ట్మెంట్లు, షాపులు

కోటీశ్వరుడైనా బిచ్చగాడు : అడుక్కున్న డబ్బులతో అపార్ట్మెంట్లు, షాపులు

బిచ్చగాడు సినిమా దాదాపుగా అందరూ చూసే ఉంటారు.  ఆ సినిమాలో రిచెస్ట్ పర్సన్ అయిన హీరో తన తల్లి ఆరోగ్యం కోసం అన్ని  పక్కన పెట్టి  బిచ్చగాళ్ళతో చేరి యాచన చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దీనికి సిక్వెల్ గా బిచ్చగాడు 2 కూడా వచ్చింది.  ఇప్పుడు మనం చెప్పుకునే భరత్ జైన్ అనే వ్యక్తి  ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ బిచ్చగాడు. 

ఇతను ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తుంటాడు. రోజుకు రూ. 2 వేల 500 వరకు సంపాదిస్తాడట. భిక్షాటన ద్వారా అతని నెలవారీ సంపాదన రూ.  60,000 నుంచి75,000 మధ్య ఉంటుందట.  భరత్ జైన్ నెట్ వర్త్ రూ.7.5 కోట్లు.. ఇతనికి ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్ రూమ్, ప్లాట్ ఉన్నాయి. థానేలో రూ.30 వేలు రెంటు  వచ్చే రెండు షాపులు కూడా ఉన్నాయి. 

Aslo Read :- వీడు మామూలోడు కాదు.. విమానాల్లో వెళ్లాడు... కన్నాలేస్తాడు.. చివరకు..

 ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాడు జైన్. ఇతనికి  భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు కాన్వె్ంట్ స్కూళ్లో చదువుకుంటున్నారు.  జైన్ తరచుగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వంటి ప్రముఖ ప్రదేశాలలో భిక్షాటన చేస్తూ కనిపిస్తారు.ఇంతా డబ్బు ఉంది కదా బిక్షాటన మానేయమని ఇంటి సభ్యులు, బంధువులు చెబుతన్నప్పటికీ జైన్ మాత్రం తన వృత్తిని వదలలేదు. 

 ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ  కొందరు వంద రూపాయిలు కూడా సంపాదించలేరు కానీ జైన్ మాత్రం 10 నుండి 12 గంటల వ్యవధిలో రోజుకు రూ. 2 వేల 500 వరకు సంపాదిస్తాడట.