ఖాకీ అనగానే మనకెందుకులే అని పక్కకు వెళతాం.. అదే ఐపీఎస్ అంటే పోలీసులకే బాస్ లాంటోళ్లు.. అలాంటి ఆఫీసర్ తో పెట్టుకోవాలంటే ముందూ వెనకా ఆలోచిస్తారు.. ఎందుకంటే తేడా వస్తే లోపలేస్తారనే భయం.. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ తోనే పెట్టుకుంది తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతి. ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే తో వివాదం పోలీస్ స్టేషన్, కేసుల వరకు వెళ్లటంతో.. ఇంతకీ ఎవరీ డింపుల్ హయాతి.. సినీ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ ఏంటీ.. ఏయే సినిమాల్లో నటించింది అనేది ఆసక్తిగా మారింది.
డింపుల్ హయాతి ఎవరు ?
డింపుల్ 1988, ఆగస్టు 21న హైదరాబాదులో జన్మించింది. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో యురేక సినిమాలో నటించింది. 2019లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్ర జర్ర ' అనే ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ఈ పాట ఆమెకు మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి చిత్రంలో నటించిన డింపుల్ హయాతి.. ఇటీవల గోపీంచంద్ హీరోగా వచ్చిన రామాబాణం చిత్రంలోనూ నటించింది.
ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవేంటి?
హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేసే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో వీరికి తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన వాహనాన్ని కాలితో తన్ని, కారుతో ఢీకొట్టిందని డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డింపుల్ హయాతీపై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
కేసులపై డింపుల్ హయాతీ రియాక్షన్ ఇదీ :
ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవపై హీరోయిన్ డింపుల్ హయతి స్పందించారు. అధికారం ఊపయోగించి తప్పును కప్పిపుచ్చలేరు.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు డింపుల్. మరో ట్విట్ లో.. అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పునూ ఆపలేరు అంటూ ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హోదాను ప్రశ్నించినట్లు ట్విట్లు చేసింది డింపుల్. సత్యమేవ జయతే అంటూ కోట్ చేయటం ద్వారా.. ఐపీఎస్ ఆఫీసర్ తన పవర్ చూపిస్తున్నారంటూ పరోక్షంగా చెప్పకనే చెప్పింది డింపుల్ హయాతి.
వరసగా చేసిన ఈ ట్వీట్ చూస్తుంటే ఈ విషయంలో తనది తప్పే లేదు.. అలాంటప్పుడు తగ్గేదేలే అన్నట్లుగా డింపుల్ కనిపిస్తుంది. అటు డీసీపీ రాహుల్ హెగ్దే మాట్లాడుతూ పార్కింగ్ ప్లేసులో చాలా సార్లు డింపుల్ కారు అడ్డంగా పెట్టిందని.. దీనిపై పలుమార్లు రిక్వెస్ట్ చేసినా తనలో మార్పు రాలేదన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు పోలీస్ ఆఫీసర్.
ఉత్తి పుణ్యానికి. .ఊరికే ఎవరూ గొడవలు పెట్టుకోరు అనేది మామూలు విషయం అయినా.. ఐపీఎస్ ఆఫీసర్ తో వివాదం కేసు వరకు రావటంతో.. డింపుల్ హయాతి ఎవరు.. ఏం చేస్తుంటారు.. ఏయే సినిమాల్లో నటించారు అనే అంశాలు ఆసక్తిగా మారాయి.
Misuse of power doesn’t hide mistakes .. ? . #satyamevajayathe
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023