కొంతమంది పిల్లలను ఎవరైనా ప్రశ్నలు అడిగితే దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తారు. ప్రస్తుతం హైటెక్ యుగంలో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పరీక్ష పేపర్లు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఓ కుర్రాడు రాస్తున్న ఎగ్జామ్ లో డాక్టర్ అంటే ఎవరు ... అనే ప్రశ్నకు వినూత్నమైన రీతిలో.. ప్రస్తుతం డాక్టర్లు .. ఆస్పత్రుల ప్రవర్తిస్తున్న తీరును బట్టి సమాధానం రాశాడు. ఆ కుర్రాడు రాసిన జవాబుకు ఎన్ని మార్కులు వేయాలో అర్దంకాక.. చివరకు ఐదుకు ఐదు మార్కులు వేశారు. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే...
గతంలో చిన్న వయసు పిల్లల్ని పెద్దయ్యాక ఏం అవుతావని అడిగితే.. చాలా మంది పిల్లలు ...డాక్టర్ ...అనే సమాధానం చెప్పేవారు. అయితే కొందరు డాక్టర్ల తీరు వల్ల పవిత్రమైన ఆ వృత్తి పట్ల చిన్న పిల్లలకు కూడా చులకన భావం ఏర్పడింది. ప్రస్తుతం డాక్టర్లు అంటే దేవుళ్లు అనే రేంజ్ నుంచి, జాలి లేని వ్యాపారస్తులు అనే రేంజ్‌కు వెళ్లిపోయారు. తాజాగా ఓ పరీక్షలో విద్యార్థి రాసిన జవాబు చూస్తే నిజమే అనిపించకమానదు. ఆ పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు కూడా అదే తరహాలో తమ స్పందనలను తెలియజేశారు. ఆ ఫన్నీ ఆన్సర్ షీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ..
ట్విటర్ హ్యాండిల్‌లో ఆ ఆన్సర్ షీట్ షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఆన్సర్ షీట్ ప్రకారం.. డాక్టర్ అంటే ఎవరు ... అనే ప్రశ్నకు ఓ విద్యార్థి తనదైన శైలిలో ఫన్నీ సమాధానం ఇచ్చాడు. డాక్టర్ అంటే.. పిల్స్ (మాత్రలు)తో మీ జబ్బులను చంపి, తర్వాత బిల్స్‌తో మిమ్మల్ని చంపే వ్యక్తి... అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం చూసిన టీచర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఐదుకు ఐదు మార్కులు వేసి ఆ ఆన్సర్ షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఆన్సర్ షీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ ఆన్సర్ షీట్ షేర్ అయింది.
Itna sach bro 😭 pic.twitter.com/Ws0XicKEOD
— Vishal (@VishalMalvi_) December 22, 2024