ఎన్ఐహెచ్ చీఫ్ గా జై భట్టాచార్య

ఎన్ఐహెచ్ చీఫ్ గా జై భట్టాచార్య
  • ఇండియన్ అమెరికన్ వైపు ట్రంప్ మొగ్గు 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్  ట్రంప్  బృందంలో ఇండియన్  అమెరికన్  జై భట్టాచార్యకు కీలక పదవి లభించే అవకాశం ఉంది. అమెరికా నేషనల్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  హెల్త్ (ఎన్ఐహెచ్) డైరెక్టర్ గా భట్టాచార్యను ట్రంప్  నియమించే అవకాశం ఉందని వాషింగ్టన్  పోస్ట్  తెలిపింది. ఈ విషయాన్ని ముగ్గురు అధికారులు వెల్లడించారని పేర్కొంది. అంతకుముందు ట్రంప్  టీంలో డిపార్ట్ మెంట్  ఆఫ్  హెల్త్  అండ్  హ్యూమన్  సర్వీసెస్  (హెచ్ హెచ్ఎస్) చీఫ్​గా నియమితులైన రాబర్ట్  ఎఫ్  కెనడీతో భట్టాచార్య భేటీ అయ్యారు.

ఎన్ఐహెచ్ ను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని, సీనియర్  అధికారుల ప్రభావాన్ని తగ్గించాలని కెనడీకి ఆయన పలు సూచనలు చేశారు. ఆయన సూచనలకు కెనడీ ఇంప్రెస్  అయ్యారని వాషింగ్టన్  పోస్ట్  తన కథనంలో పేర్కొంది. జై భట్టాచార్య ఇండియాలోని కోల్ కతాలో 1968లో జన్మించారు. స్టాన్ ఫర్డ్  యూనివర్సిటీలో హెల్త్  పాలసీ ప్రొఫెసర్ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నేషనల్  బ్యూరో ఆఫ్  ఎకనామిక్స్  రిసర్చ్ లో రిసర్చ్  అసోసియేట్ గా పనిచేస్తున్నారు. స్టాన్ ఫర్డ్  వర్సిటీలోనే ఎకనామిక్స్ లో ఎండీ, పీహెచ్ డీ చేశారు. స్టాన్ ఫర్డ్  సెంటర్  ఫర్  డెమోగ్రఫీ అండ్  ఎకనామిక్స్  ఆఫ్​ హెల్త్  అండ్  ఏజింగ్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదే వర్సిటీలో ఆయన ఫిజీషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. 

ఆర్థిక మంత్రిగా స్కాట్ బెసెంట్

అమెరికా ఆర్థిక మంత్రిగా ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారుడు స్కాట్  బెసెంట్, కార్మిక శాఖ మంత్రిగా కాంగ్రెస్  మహిళా ప్రతినిధి లోరీ చావెజ్ డి రీమర్, యూఎస్ సర్జన్ జనరల్ గా డాక్టర్ జానెట్ నేష్ వాట్ ను నియమిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ సలహాదారు ప్రిన్సిపల్  డిప్యూటీగా అలెక్స్ వాంగ్, ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీనియర్  డైరెక్టర్ గా డాక్టర్ సెబాస్టియన్ ను ట్రంప్ నియమించారు.