ధనుర్మాసం: గోదాదేవి ఎవరు ? తిరుప్పావై పాశురాలు అంటే ఏమిటి?

ధనుర్మాసం: గోదాదేవి ఎవరు ?   తిరుప్పావై పాశురాలు అంటే ఏమిటి?

ధనుర్మాసం కొనసాగుతుంది.  తెలుగు రాష్ట్రాల్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయాలు సహా.. తిరుమలలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. తిరుప్పావైను 1200 సంవత్సరాల క్రితం గోదాదేవి అవతరించిన  వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో(4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది. తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.

పాశురాల పరమార్ధం

తిరుప్పావైలో  మొత్తం 30 పాశురాలు  ఉన్నాయి. ఇందులో మొదటి ఐదింటిలో ఉపోద్ఘాతం ఉంటుంది.  తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుడిని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని పాశురాల్లో గోదాదేవి పేర్కొన్నారు. 

ALSO READ : ఆధ్యాత్మికం : ధనుర్మాసం నెలలో.. తిరుమల శ్రీవారి పూజల్లో ప్రత్యేకత ఏంటీ.. సుప్రభాతం సేవ ఎందుకు రద్దు చేస్తారు..?

తర్వాత పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలను వర్ణించారు.  వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు, అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు, రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.

చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.