మెడలో రుద్రాక్ష హారం, నుదిటిపై తిలకం.. కుంభమేళాలో ఈమెనే హైలెట్.. ఎవరీమె..?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహాకుంభ మేళా’ప్రారంభమైన విషయం తెలిసిందే. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు, సాధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మహాకుంభ మేళాలో ఓ మహిళా సాధ్వి అందరినీ ఆకర్షిస్తోంది. మెడలో రుద్రాక్ష హారం, పువ్వుల మాల ధరించి నుదిటిపై తిలకంతో చాలా అందంగా కనిపించే సరికి ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఎవరు..? ఆమె గతం ఏంటి..? అనేది తెలుసుకుందాం.. 

సాధ్వి.. హర్ష రిచార్య 

మహాకుంభ మేళాలో సాధ్విగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మహిళ పేరు.. హర్ష రిచార్య(Harsha Richhariya). 1994 మార్చి 26న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన హర్ష రిచార్య మోడల్‌, యాంకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో హోస్ట్‌గా, మనదేశంతో పాటు విదేశాల్లో జరిగిన ఈవెంట్స్‌లోనూ హోస్ట్‌గా చేసింది. అనేక ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌లో నటించింది. అయితే, రెండేళ్ల కిందట ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో కొత్త జీవితం ప్రారంభించింది.

ALSO READ | మహా కుంభమేళా షురూ.. తొలిరోజే కోటిన్నర మంది పుణ్యస్నానాలు

తన వయసు 30 ఏళ్లని, రెండేళ్లుగా సాధ్విగా జీవిస్తున్నానని హర్ష రిచార్య చెప్పింది. తాను నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలనని తెలిపింది. ఆయన మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

అందంపై ప్రశ్న.. 

ఆమె అందంపై ఓ ప్రశ్న ఎదురవ్వగా.. దేశముదురు సినిమాలో హన్సిక వలె అంతటా మట్టిలో కలిసిపోయేదే అన్నట్లుకొట్టిపారేసింది. జీవితంలో తాను అన్నీ చూసేశానని.. ఎందులో లభించని శాంతి భక్తి మార్గంలో దొరికిందని తెలిపింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌‌లో 9 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ప్రధానంగా తన ప్రొఫైల్‌ లో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్‌ షేర్ చేస్తుంది. కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఆమె కొవ్వొత్తుల వెలుగులో పాల్గొన్నట్లు ఒక వీడియోఉంది.