Iman Esmail: ప్రభాస్తో ఛాన్స్ కొట్టేసిన యంగ్ యూట్యూబర్‌..అస‌లెవ‌రీ ఇమాన్ ఇస్మాయిల్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబోలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం శనివారం ఆగస్ట్ 17న గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకలో మెరిసిన హీరోయిన్ ఇమాన్ ఇస్మాయిల్(Iman Esmail) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు లాంచ్ ఈవెంట్‌లో ఆమె ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇమాన్ నటిగా, డ్యాన్సర్ గా, యూట్యూబర్‌ గా తన టాలెంట్ ని నిరూపించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకుంది.

ALSO READ | Kalki 2898 AD OTT: ఓటీటీలో రిలీజైన కొన్ని గంటల్లోనే కల్కి 2898AD టాప్ 1 ట్రెండింగ్

ప్రభాస్ తో..హను రాఘవపూడి తెరకెక్కించనున్న ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది 1940లలో జరిగిన రజాకార్ల ఉద్యమం ఆధారంగా రూపొందించబడుతుంది. ఈ మూవీలో ప్రభాస్ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా నటించబోతున్నాడు.

ఎవరీ ఇమాన్ ఇస్మాయిల్?

అక్టోబరు 20, 1995న జన్మించిన ఇమాన్ కరాచీకి చెందిన ఒక పాకిస్తానీ సైనిక అధికారి కుమార్తె. ఇమాన్ ఇస్మాయిల్ ఢిల్లీకి చెందిన డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. తన డ్యాన్స్ షోస్ తో, డ్యాన్స్ రీల్స్‌ తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. యూట్యూబ్‌లో 1.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మంది ఫాలోయర్స్ ని కలిగి ఉంది. యూట్యూబర్‌గా ఇమాన్ నెలకు రూ.4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@imanvi1013)

28 ఏళ్ల ఇమాన్ ఇస్మాయిల్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అయిన‌ప్ప‌టికీ.. మూడు దేశాల పౌర‌స‌త్వం సంపాదించింది. సైకాలిజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. నూయార్క్ లో మాస్ట‌ర్స్‌ చ‌దివిన ఇమాన్.. సోష‌ల్ మీడియాలో ఇమాన్వీగా ప్ర‌సిద్ధి చెందింది. ఎలియాస్ ఖురేషీ డైరెక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్‌తో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. అదే ఆమె కెమెరా ముందు నటించిన మొదటి అనుభవం..మరియు ఫస్ట్ బ్రేక్. ఇక తొలి సినిమాతోనే ప్రభాస్ తో అవకాశం రావడం..వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందడం కన్ఫమ్ అని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@imanvi1013)