Team Indial: ఆ ముగ్గురిలో బ్యాటింగ్ కోచ్ ఎవరు..?: చిచ్చు పెట్టిన పాక్ మాజీ క్రికెటర్

Team Indial: ఆ ముగ్గురిలో బ్యాటింగ్ కోచ్ ఎవరు..?: చిచ్చు పెట్టిన పాక్ మాజీ క్రికెటర్

స్వదేశంలో రారాజులా బ్రతుకుతోన్న టీమిండియాను న్యూజిలాండ్ చిక్కుల్లో పడేసింది. రోహిత్ సేన.. కివీస్ చేతిలో  టెస్ట్ సిరీస్‌ను 0-3తో కోల్పయిన నాటి నుండి ఒకటే విమర్శలు. స్పిన్ ఆడటంలో మన బ్యాటర్లు తడబడుతున్నారని కొందరంటే, మన ఐపీఎల్ హీరోలకు అసలు బ్యాటింగే రాదని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశారు. 

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాగా.. అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటే(స్కాట్లాండ్) ఉన్నారు. ఈ ముగ్గురిలో భారత బ్యాటింగ్ కోచ్ ఎవరో చెప్పాలని బాసిత్ అలీ ప్రశ్నించాడు. సొంతగడ్డపై భారత బ్యాటర్లు స్పిన్ ఆడలేక చేతులెత్తేయడంతో తన మదిలో ఈ ప్రశ్న కలిగిందని పాక్ మాజీ పేర్కొన్నాడు.

ఇండియా కా బ్యాటింగ్ కోచ్ హై కౌన్?

"భారత బ్యాటింగ్ కోచ్ ఎవరు..? ప్రతి ఓవర్‌లో 10,12 పరుగులు చేయాలన్న ఆలోచన ఎవరిది. ఐదు రోజులు ఆడే టెస్ట్ క్రికెట్‌లో ఇది సాధ్యం కాదని వారికి తెలియదా..! జైస్వాల్, గిల్ వంటి ఆటగాళ్లు 30 నుంచి 35 పరుగులు చేశాక.. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు పారేసుకుంటున్నారు. ఇలాంటి ఆట కాదు కోరుకుంటోంది.. మూడు సెషన్ల ఆడటానికి ప్రయత్నించండి అని చెప్పండి. అలాంటప్పుడే బ్యాటర్ విజయం సాధించగలడు. అందరూ విరాట్ కోహ్లీ , రిషబ్ పంత్‌లా ఉండరు. స్పిన్ ట్రాక్‌లలో కుదురుకోవడం ముఖ్యం. ఇలాంటి ఆట నేర్పుతున్న భారత కోచ్ ఎవరో తెలుసుకోవాలని ఉంది.." అని బాసిత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. 

పాక్ మాజీ మాటల్లో వాస్తవం లేకపోలేదు. గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో అభిషేక్ నాయర్, డచ్‌మాన్ డస్కాటే ఉన్నప్పటికీ, వారి పాత్రల్లో క్లారిటీ లేదు. ఇదే విషయాన్నీ భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం లేవనెత్తారు.