ఎవడీ సైఫుల్లా కసూరీ..: పహల్గాం ఉగ్ర దాడి వెనక ఉన్నది ఈ కిరాతకుడేనా..?

ఎవడీ సైఫుల్లా కసూరీ..: పహల్గాం ఉగ్ర దాడి వెనక ఉన్నది ఈ కిరాతకుడేనా..?

జమ్మూలోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి వెనక.. కుట్ర వెనక.. ప్లాన్ అమలు చేసింది లష్కరే తోయిబా కమాండర్ పనే అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. భారత సైన్యం దుస్తుల్లో వచ్చి..టూరిస్టులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వెనక.. లష్కరే తోయిబా స్థానిక శాఖ ఉన్నట్లు ఇప్పటికే వాళ్లు ప్రకటించారు.ఈ కిరాత చర్యకు ప్లాన్ వేసింది..అమలు చేసింది లష్కర్ తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఈ కసూరి సైఫుల్లా ఎవరు.. ఈ కిరాతకుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనేది ఇప్పుడు చూద్దాం..

సైఫుల్లా కసూరి ఎవరు?

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం(ఏప్రిల్ 22)న 28 మందిని బలిగొన్న ఘోర ఉగ్రవాద దాడి వెనక లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సీనియర్ కార్యకర్త సైఫుల్లా కసూరి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.ఖలీద్ అనే మారుపేరుతో పిలువబడే సైఫుల్లా ఈ దారుణానికి కుట్రపన్నినట్లు తెలుస్తోంది. సైఫుల్లా కసూరి ఎల్ ఇటీ గ్రూప్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సారధ్యంలో కమాండర్ గా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రిపోర్ట్ ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లోని హ్యాండర్ల మద్దతుతో ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

ALSO READ : పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నది పాకిస్థాన్కు చెందిన ఈ టెర్రర్ గ్రూపే

పాకిస్తానీ జాతీయుడైన సైఫుల్లా కసూరి..ఎల్‌ఇటి ఉగ్రావాద సంస్థలో అనుభవజ్ఞుడైన మెంబర్. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సూత్రధారి.  ఖలీద్ అనే మారుపేరుతో కసూరి ఎల్‌ఇటి అత్యంత విశ్వసనీయ ఫీల్డ్ కమాండర్లలో ఒకరిగా ఉన్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.