
మస్తాన్ సాయి.. గత 20 రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఇతగాడి పేరెత్తితే.. సినీ ఇండస్ట్రీతో పరిచయమున్న కొందరు అమ్మాయిలు, మహిళలు గజగజ వణుకుతున్న పరిస్థితులు. గతంలో ఇతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నప్పటికీ, హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీసులకు అందించిన హార్డ్ డిస్క్‌తో ఇతగాడు మరింత ఫేమస్ అయ్యాడు. ఆ హార్డ్ డిస్క్‌లో వందల కొద్దీ అమ్మాయిలు, మహిళల నగ్న వీడియోలు.. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకున్న వీడియోలు బయటపడటం మస్తాన్ సాయి పేరును దేశమంతా పరిచయం చేసింది.
అసలు ఎవరీ మస్తాన్ సాయి..? ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అమ్మాయిలతో పరిచయాలు ఎలా..? నగ్న వీడియోల సంగతేంటి..? రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యతో ఇతడికున్న సంబంధం ఏంటి..? అనేది చూద్దాం..
బీ టెక్ చదువు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
మస్తాన్ సాయి పూర్తి పేరు రావి మస్తాన్ సాయి. స్వస్థలం.. గుంటూరు జిల్లా. బీటెక్ పూర్తి చేసిన ఇతగాడు ఏడాది పాటు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎలగబట్టాడు. ఆ క్రమంలోనే పబ్‌ల చుట్టూ తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. చివరకు అదే వ్యాపారంగా మలచుకొని టాలీవుడ్‌కు చెందిన పలువురితో సంబంధాలు పెట్టుకున్నాడు.
అలా వచ్చిన డబ్బుతో ఖరీదైన కార్లలో తిరుగుతూ చూడగానే బాగా రిచ్ క్యాండెట్‌నేలా కనపడేవాడు. ఇంకేముంది..! అమ్మాయిలు అతని మాయలో పడిపోయేవారు. ముఖ్యంగా సినిమాల్లో నటించేందుకు ఆసక్తిచూపే అమ్మాయిలను మస్తాన్ సాయి టార్గెట్ చేసేవాడు. అందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్ అతడి ఆయుధం అన్న టాక్ ఉంది.
సినిమా పిచ్చితో అందమైన ఫోటోలు పెట్టే అమ్మాయిలను, మహిళలకు మెసేజులు పంపి గాలం వేసేవాడట. వారు తన వలలో పడగానే నీళ్లు, కూల్‌డ్రింకులు, చాక్లెట్ల ద్వారా డ్రగ్స్ ఇచ్చి.. వారిని లైంగికంగా లోబర్చుకునేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి.. అనంతరం వారిని బ్లాక్‌మెయిల్ చేసి నచ్చినచోటికి రప్పించేవాడు. అలా వీడియోలు తీసిన వారిలో కొందరిని డబ్బు కోసం ఇతరుల వద్దకు పంపేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.
లావణ్యతో పరిచయం..
2022లో మస్తాన్ సాయికి లావణ్యతో పరిచయం ఏర్పడింది. ఉన్నిత్ రెడ్డి అనే వ్యక్తి మస్తాన్ సాయికి తనను పరిచయం చేశాడని లావణ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని మస్తాన్ సాయి.. ఇంట్లో పార్టీ ఉందని చెప్పి లావణ్యను ఇంటికి పిలిపించాడు. అలా వచ్చిన ఆమెకు తన బెడ్ రూమ్ వాడుకోమని సలహా ఇచ్చి.. అక్కడ డ్రెస్ మార్చుకుంటుండగా రహస్యంగా వీడియోలు తీశాడు. మరోసారి పార్టీ పేరుతో పిలిచి.. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్నాక ప్రైవేట్ వీడియోలు తీశాడు. తీరా ఆ విషయం లావణ్యకు తెలియడంతో బెదిరింపులకు దిగాడు. పోలీసులకు చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని వార్నింగ్ ఇచ్చాడు.
ఎలాగోలా రాజ్ తరుణ్‌కు చెప్పి.. మస్తాన్ సాయి దగ్గరున్న వీడియోలు, ఫోటోలు డిలీట్ చేపించుకుంది లావణ్య. కానీ, మస్తాన్ సాయి మరో పతకం ఉన్నాడు. అప్పటికే అవన్నీ హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసి ఉంచాడు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకొని 2023లో తన సోదరి పెళ్లి ఉందని చెప్పి.. లావణ్యను గుంటూరుకు తీసుకువెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు. అతని చెర నుంచి తప్పించుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే లావణ్య- రాజ్ తరుణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని.. ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్ర మోజులో పడి తనను వదిలేశాడని లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య, లావణ్య వర్సెస్ మస్తాన్ సాయి వ్యవహారం బయటకొచ్చింది. మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్.. లావణ్య- మస్తాన్ సాయి రిలేషన్‌ను బయటపెట్టాడు. అప్పటికే మస్తాన్ సాయి వీడియోలు తీసిన సంగతి రాజ్ తరుణ్ కు తెలియడంతో లావణ్య మరో టర్న్ తీసుకుంది.
మస్తాన్ సాయిపై పోలీసులకు పిర్యాదు చేసింది. అతడు రహస్యంగా తీసిన వీడియోల సంగతి బయట పెట్టింది. రాజ్ తరుణ్ తో విడిపోవడానికి మస్తాన్ సాయినే కారణమని ఆరోపించింది. అతడు ఫోన్ కాల్ లీక్స్ చేయడంతోనే రాజ్ తరుణ్ తో రిలేషన్ బ్రేక్ అయ్యిందని, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది మస్తాన్ సాయి అని ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఎలాగూ రాజ్ తరుణ్ దూరమవ్వడంతో.. మస్తాన్ సాయి అరాచకాలు బయటపెట్టాలని లావణ్య నిర్ణయించుకుంది.
తన వీడియోల కోసం అతని ఐప్యాడ్ చెక్ చేసిన సమయంలో.. అందులో వేరే వాళ్ల నగ్న వీడియోలు ఉండటం చూసి ఖంగుతుంది. సమయం కోసం వీచు చూసి అతని వద్ద కీలకమైన హార్డ్ డిస్క్ కొట్టేసి.. పోలీసులకు అప్పగించింది. దాంతో, హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమ్మాయిల వీడియోలు తీసి వాటిని బయట పెడతానని బెదిరించి డబ్బు కాజేయడం మస్తాన్ సాయి హాబీగా పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌లో అనేక మంది యువతులకు చెందిన వీడియోలతో పాటు టాలీవుడ్‌కు చెందిన హీరో నిఖిల్ వంటి పలువురు వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మస్తాన్ సాయి వికృత చేష్టల్లో మరో కోణమూ వెలుగుచూసింది. అమ్మాయిల నగ్న వీడియోలు తీయడం.. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడం అతని పని అనుకున్నారు. కానీ ఆ వీడియోలను విదేశీ అశ్లీల వెబ్‌సైట్లలోకి పంపి లక్షలు ఆర్జించేవాడని తాజాగా వెల్లడైంది. తొలుత వీడియోల తాలూకు ప్రోమోలను అప్‌లోడ్ చేసి.. ఆసక్తి ఉన్నవారు వాటిని క్లిక్ చేయగానే డాలర్లను డిమాండు చేసేవాడట. ఇలా ఒక్కటేమిటి పోలీస్ కస్టడీలో అతడి లీలలు ఎన్నో బయటకొస్తున్నాయి.
14 రోజుల రిమాండ్
నగ్న వీడియోలు, డ్రగ్స్ కేసులో కస్టడీ ముగియడంతో.. మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.దాంతో, పోలీసులు అతన్ని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. అంతకుముందు కస్టడీ విచారణలో మస్తాన్ సాయి కీలక విషయాలు బయట పెట్టినట్లు తెలుస్తోంది. లభ్యమైన హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను వారి వారి పేర్లతో ఒక్కో ఫోల్డర్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీడియోల్లో ఎక్కువగా వారిపై అత్యాచారం చేసే సమయంలో తీసినవి ఉన్నట్లు సమాచారం. అలాగే మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించి వీడియోలో ఉన్న వారందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.