
సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్, కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. 25 ఏళ్ల మిషా అగర్వాల్ ఏప్రిల్ 24న ఇంట్లోనే చనిపోయినట్లు.. వారి కుటుంబం ప్రకటించింది. అప్పటి నుంచి ఎందుకు.. ఏమైందీ.. ఎలా జరిగింది అనే విషయాలపై సోషల్ మీడియా పలు వార్తలు రాస్తూ వచ్చింది. దీంతో ఎట్టకేలకు మిషా అగర్వాల్ సోదరి స్పందించింది. తన చెల్లెలు మిషా అగర్వాల్ ఆత్మహత్యకు కారణాలు వెల్లడించింది.
మిషా అగర్వాల్ సోషల్ మీడియాకు బానిస అయ్యింది. తన ఇన్ స్ట్రా ఫాలోవర్స్ ను 10 లక్షలకు రీచ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నది. ఈ లక్ష్యంతో తన చదువును మానేసింది. రాత్రీ పగలూ అని తేడా లేకుండా రీల్స్ చేయటం.. ఫాలోవర్స్ పెంచుకోవటంపైనే దృష్టి పెట్టింది. తన ఇన్ స్ట్రా ఫాలోవర్స్ 3 లక్షల 54 వేల వరకు వచ్చారు. కొన్ని రోజులుగా తన ఫాలోవర్స్ తగ్గటం మొదలైంది.. దీంతో తీవ్ర మనోవేదనకు గురైంది. కంటెంటే చేస్తున్నా.. ఫాలోవర్స్ పెరగకపోగా.. తగ్గిపోవటంపై తీవ్రంగా ఆందోళన చెందింది. ఈ విషయంపై కుటుంబం సభ్యులతో చర్చించగా.. చదువుపై దృష్టి పెట్టాలని.. LLB చదవాలంటూ కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వదిలేయాని.. కెరీర్ పై దృష్టి పెట్టాలని ఒత్తిడి చేశారు.
సోషల్ మీడియా నుంచి బయటకురాలేని మిషా అగర్వాల్.. రీల్స్ చేయటం.. ఇన్ స్ట్రా ఫాలోవర్స్ పెంచుకోవటంపైనే దృష్టి పెట్టింది. అయినా ఫలితం లేకపోవటంతో.. డిప్రెషన్ లోకి వెళ్లి.. ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మా చెల్లెలు పిచ్చి పని చేసింది.. తాను ప్రాణాలు తీసుకోవటం కాదు.. మా జీవితాలను.. మా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది అంటూ మిషా అగర్వాల్ సోదరి సోషల్ మీడియాలో ప్రకటించటంతో.. ఆత్మహత్యలోని మిస్టరీ వెలుగులోకి వచ్చింది.
►ALSO READ | అమెరికాలో భార్యాకొడుకును కాల్చి చంపిన ఇండియన్ టెకీ
ఇన్ స్ట్రా ఫాలోవర్స్ విషయంలో ఓ ఇన్ఫులెన్సర్ ఆత్మహత్య చేసుకోవటం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఇది పిచ్చి పని అని.. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని.. సోషల్ మీడియా అనేది జీవితం కాదని.. కాలక్షేపం అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఏదిఏమైనా సెల్ ఫోన్ పిచ్చి.. గేమింగ్ పిచ్చి.. ఫాలోవర్స్ పిచ్చి.. రీల్స్ పిచ్చి అనేది పీక్ స్టేజ్ కు వెళ్లింది అనటానికి.. మిషా అగర్వాల్ ఇన్సిడెంట్ ఓ ఎగ్జాంపుల్.. బీ కేర్ ఫుల్..