Mohini Dey: 28 ఏళ్ల అసిస్టెంట్‌తో ఏఆర్ రెహమాన్ ఎఫైర్!.. ఎవరీ మోహిని డే..?

Mohini Dey: 28 ఏళ్ల అసిస్టెంట్‌తో ఏఆర్ రెహమాన్ ఎఫైర్!.. ఎవరీ మోహిని డే..?

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (Ar Rahman), ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ 30 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో సోషల్ మీడియా అంతా ఈ వార్తే చక్కర్లు కొడుతోంది. అయితే, విడాకులు తీసుకోవడం అనేది ఎవరి జీవితంలో అయినా చాలా కష్టతరమైన క్షణాలే.

కానీ, ఇంత సడెన్గా ఏఆర్‌ రెహమాన్‌(57) బుధవారం (నవంబర్ 20న) ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం వెనుక కారణాలు ఏంటనేవి వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు. ఇందులో భాగంగా ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్గా పనిచేసే మోహిని డే (Mohini Dey) కూడా తన భర్త సాక్సోఫోన్ వాద్యకారుడు 'మార్క్ హార్ట్‌సచ్‌'తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

ఏఆర్ రెహమాన్ డివోర్స్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే, ఆయన అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్తకు విడాకులు ప్రకటించి హాట్ టాపిక్ గా మారింది.. ఒక్కమాటలో చెప్పాలంటే మోహిని డే ఎవరు? అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఎవరీ మోహిని డే?

మోహిని డే (28years) కోల్‌కతాకు చెందిన ఒక గిటార్ ప్లేయర్. అలాగే నిర్మాత, ప్రొడ్యూసర్, ఫ్యాషన్ డిజైనర్ మరియు వ్యాపారవేత్త కూడా. అయితే, ఈ మోహిని డే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్కు గిటార్ వాయించే అమ్మాయి. దీంతో ఏఆర్ రెహమాన్ విడాకుల వార్తల వెనుక పెద్ద స్కెచ్ఏ.. ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా తమ డివోర్స్ పోస్టులో..'తమ ప్రైవసీని గౌరవించండి.. మ్యూచువల్గా డిసైడ్ అయ్యే ఈ నిర్ణయం తీసుకున్నాం' అంటూ వారి వారి పోస్టుల్లో రాసుకొచ్చారు.

ALSO READ | Theater Releases: ఈ వారం (Nov 22న) థియేటర్‌లో రిలీజ్ కానున్న 7 సినిమాలు.. వాటి స్టోరీ లైన్స్!

ఇక వీరిద్దరి పోస్టుల మధ్య గంటల వ్యవధి మాత్రమే ఉండడం చూస్తుంటే .. ముందుగా అనుకుని ఇలా తమ పార్ట్నర్స్ నుంచి విడాకులు తీసుకున్నారా? ఇద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇక నెటిజన్స్ అయితే.. 57 ఏళ్ల రెహమాన్.. 28 ఏళ్ళ మోహిని ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు? దీంతో ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్ ఎటూ అర్ధంకాక.. ఏదీ తేల్చుకోలేక పోతున్నారు. మరీ వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohini Dey (@dey_bass)