ఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !

ఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !

భిన్నత్వంలో ఏకత్వం కలగలిసిన మన సమాజంలో అందరూ సమానమేనని చెబుతారు. ఎవరికీ వేధించే హ క్కు లేదని వాదిస్తారు. మరి ఆడ, మగ విషయంలో ఆ సమన్యాయాన్ని పాటిస్తున్నారా..! అంటే సందేహించాల్సిందే. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా.. మగజాతిదే తప్పంటోంది ఈ సమాజం. గయ్యాళిలా మహిళా రోడ్డుపై ఓ యువకుడిని చితకబాదిన.. వాడు ఏదో ఒకటి వెధవ పని చేసుంటాడులే అంటారే తప్ప, అతన్ని కాపాడే ప్రయత్నం ఎవరూ చేయరు. 

ఇక భార్యాభర్తల కుటుంబ వివాదాల్లో గృహహింస చట్టాలు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గృహహింస చట్టాలు ఒక్క మహిళలకు మాత్రమే సెక్యూరిటీని కల్పిస్తాయి. మరి మగవాళ్ల సంగతేంటి..? తప్పు చేయకపోయినా మగజాతి చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందేనా..? చట్టాలు అనుకూలంగా ఉన్నాయని మగవారి స్వేచ్చను దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్న వారికి ఎలాంటి శిక్షలు ఉండవా..? టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్యతో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.

ALSO READ | PAK vs SA 1st T20: బుమ్రాకు ఛాలెంజ్.. 149 కి.మీ వేగంతో బాబర్‌ను డకౌట్ చేసిన 18 ఏళ్ళ పేసర్

పెళ్లి, పిల్లలు అంటూ అందరిలా ఎన్నో కలలు కన్న టెకీ అతుల్ సుభాష్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. భార్య వేధింపులు.. పోలీసుల విచారణలు.. న్యాయస్థానాల తీర్పులు.. తనను కష్టాల సుడిగుండం నుండి బయటపడేయలేవు అనుకున్న టెకీ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 24 పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. ఎవరీ అతుల్ సుభాష్..? ఏంటి ఈ కథ..?

సింఘానియాతో వివాహం.. ఓ బిడ్డ

అందరిలా బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఓ సాధారణ వ్యక్తి.. అతుల్ సుభాష్. అతనికి 2019లో నికితా సింఘానియాతో వివాహం జరిగింది. ఎడదన్నర తరువాత కుమార్తె ఇంటికొచ్చింది. అక్కడినుంచి అతని జీవితం తలకిందులైంది. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో ఆ జంట విడిపోయారు. కొన్నాళ్లకే అతుల్ సుభాష్‌పై మాజీ భార్య నికితా సింఘానియా తప్పుడు కేసులు బనాయించింది. అసహజ శృంగారం, కట్నం కోసం వేధించాడంటూ అనేక కేసులు పెట్టింది. పరిష్కారం కోసం కోట్లు డిమాండ్ చేసింది. అంత ఇచ్చుకునే స్తోమత అతనికి లేదు. నిజానిజాలేంటో తెలుసుకోవాల్సిన పోలీసులు.. ఆ ప్రయత్నమే చేయకుండా అతనిపై కేసులు పెట్టారు.

24 పేజీల సూసైడ్ నోట్

ఉద్యోగం చేయకపోతే జీవితాన్ని నెట్టుకు రావడం కష్టం.. ఇటు చూస్తే అనేక కేసులు.. వారానికో విచారణ.. వీటన్నిటి నుంచి బయటపడే మార్గమే అతనికి కనిపించలేదు. న్యాయస్థానం ముందు తన వాదన ఎన్ని సార్లు వినిపించుకున్నా చట్టంలో ఆ వెసులుబాటు లేదని గ్రహించి.. మానసికంగా కృంగిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. అతకుముందు అతను తనకు జరిగిన ప్రతి అవమానాన్ని, ప్రతి అన్యాయాన్ని సమగ్రంగా 24 పేజీల లేఖలో ప్రస్తావించారు. అలాగే తన ఒంటిపై  జస్టిస్ ఈజ్ డ్యూ (న్యాయం జరగాలి) అని ఒక పేపర్ అతికించుకున్నారు. ఈ స్థాయిలో అతను ప్రాణాలు తీసుకున్నాడంటే.. ఆ మహాతల్లి ఎంత వేధించిందో అర్థం చేసుకోవాలి.

ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఎందుకు..?

మృతుడు అతుల్ మాజీ భార్య పని చేస్తున్న సంస్థే.. యాక్సెంచర్. నికితా సింఘానియా ఏఐ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా యాక్సెంచర్ ఐటీ కంపెనీలో పని చేస్తోంది. 2021లో ఆమె యాక్సెంచర్‌లో చేరింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. అతుల్ మరణానికి కారణమైన నికితా సింఘానియాను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని నెటిజన్లు ఐటీ కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం ద్వారా చనిపోయిన టెక్కీకి కాసింతైనా న్యాయం జరుగుతుందని వారు యాక్సెంచర్‌ యాజమాన్యానికి సూచిస్తున్నారు. 

అయితే, ఈ విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. బదులుగా యాజమాన్యం యాక్సెంచర్ X (ట్విట్టర్) హ్యాండిల్‌ యాక్సెస్‌ని పరిమితం చేసింది.