సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విడిపోతున్నారట.. అనే ముచ్చట్లు ఇక అక్కర్లేదు. వీరు పిడిపోయారా..! డివోర్స్ ఎప్పుడయ్యాయి.. అనే కథనాలు మనకొద్దు. షోయబ్ అన్నిటికి స్పష్టతనిచ్చాడు. మొన్నటిదాకా భారత అల్లుడినని చెప్పుకునే ఈ పాక్ క్రికెటర్.. ఇప్పుడు భారత టెన్నిస్ స్టార్ కు గుడ్ బై చెప్పి మరొకరిని నిఖా చేసుకున్నాడు. సనా జావేద్ అనే ఓ అందమైన పాకిస్తానీ నటిని తన వశం చేసుకున్నాడు. దీంతో షోయబ్ మనువాడిన ఆ అందగత్తె సనా జావేద్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
షోయబ్ మాలిక్.. సనా జావేద్ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలోనే పుకార్లు వచ్చాయి. గతేడాది సనా పుట్టినరోజు సందర్భంగా ఈ పాక్ క్రికెటర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపి అగ్నికి ఆజ్యం పోశాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు బడ్డీ.." అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. అప్పట్లోనే వీరిద్దరి బంధంపై పాక్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.
- Alhamdullilah ♥️
— Shoaib Malik ?? (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
ఎవరీ సనా జావేద్..?
సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. ఆమె మార్చి 25, 1993న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించింది. ఆమె పూర్వీకులది మన హైదరాబాదే. దేశ విభజన సమయం కంటే ముందు జావేద్ పూర్వీకులు కాశ్మీర్ వెళ్లారు. అనంతరం దేశ విభజన సమయంలో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ తదనంతరం ఉద్యోగ, వ్యాపార నిమిత్తం సనా తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు.
2012లో షెహర్-ఎ-జాత్‌తో నటిగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అనేక రొమాంటిక్ డ్రామాల్లో నటించి మెప్పించింది. ఖానీ చిత్రంలో తన నటనకుగానూ లక్స్ స్టైల్ అవార్డుల నామినేషన్‌ను అందుకుంది. అక్టోబర్ 2020లో సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను పెళ్లాడిన ఈ భామ.. కొంతకాలానికే అతనితో బంధాన్ని తెంచుకొని ఒంటరిగా జీవించటం ప్రారంభించింది. అంతలోనే మాలిక్ పరిచయమవ్వడం.. అది కాస్తా ప్రేమకు దారితీయటం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే సానియా- షోయబ్ మధ్య విబేధాలు తలెత్తడంతో.. భారత టెన్నిస్ స్టార్ కు గుడ్ బై చెప్పిన పాక్ క్రికెటర్ మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాడు.
మొదట అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్.. 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మొత్తానికి షోయబ్ మాలిక్ పెళ్లిళ్ల వ్యవహారం రెండు దేశాల్లోనూ వ్యవహారం హైలైట్అవుతోంది.
Sana Javed Is Now Third Wife Of Shoaib Malik !
— ????? ? (@TruthCrusaderX7) January 20, 2024
But We Should Not Forget The OG Abdul !
Watch Video Till End To Find Out !#ShoaibMalik #SaniaMirza #MunawarFaruqui pic.twitter.com/UDKZshGytn