నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఫొటోస్ లో బాలకృష్ణ దంపతులతో పాటు బ్లూ కలర్ డ్రెస్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఎవరంటూ సెర్చింగ్ మొదలు పెట్టేశారు నెటిజన్స్.
ఇంతకీ ఆ యువతీ ఎవరంటే.. ఇటీవల జరిగిన తానా సభల్లో నేను మీ అభిమానిని అంటూ ఒక అమ్మాయి బాలయ్య దగ్గరకు వచ్చింది. విశేషం ఏంటంటే ఆరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు కూడా. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. ఆ అమ్మాయి కోసం స్పెషల్ గా కేక్ తెప్పించి మరీ కట్ చేయించారు. ఈ సందర్బంగా ఆ యువతీ.. బాలకృష్ణ, వసుందర దంపతుల వద్ద ఆశీర్వాదం కూడా తీసుకుంది.
ఆ సమయంలో తీసిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ అమ్మాయి పట్ల బాలకృష్ణ చూపించిన ప్రేమను చూసి బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. "ప్రేమను పంచడంలో మా బాలయ్య తరువాతే ఎవరైనా.. జై బాలయ్య" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.