తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కాగా మొదటివారం ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు రెండోవారం ఎలిమినేషన్స్ లో కొంతమేర ఆసక్తి నెలకొంది. కాగా రెండవ వారం నామినేషన్లలో మొత్తం 8మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా శేఖర్ బాషా, నైనికా, సీత, విష్ణుప్రియా, నిఖిల్, ఆదిత్య
పృథ్వీరాజ్, నాగ మణికంఠ తదితరులు ఈ ఎలిమినేషన్స్ లో ఉన్నారు.
అయితే ఇప్పటివరకూ ఈ ఎలిమినేషన్ టాస్క్ రెండు రోజులపాటు జరిగింది. పోల్స్ లో ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం, నైనికా, పృథ్వీ రాజ్ తదితరులు కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి బాగానే కష్ట పడుతున్నారు. కానీ మిగిలిన శేఖర్ భాష, సీత కి ఓట్లు తక్కువగా ఉండటంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ | తెలంగాణ సినిమా ఎక్కడ?.. గత పదేండ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం
అయితే ఇందులో ఇప్పటివరకూ శేఖర్ భాషా కి ఓట్లు తక్కువగా ఉన్నపటికీ తన ఆటతీరుతో ఆడియన్స్ ని బాగానే అలరిస్తున్నాడు. దీంతో ఈ వారం సీత కి ఎలిమినేషన్ తప్పదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.