- శాతవాహనుల జన్మభూమి కర్ణాటక ప్రాంతమని డాక్టర్ సుక్తాంకర్ అభిప్రాయపడ్డారు.
- శాతవాహనుల జన్మభూమి విదర్భ అని వి.వి.మిరాసి అభిప్రాయపడ్డారు.
- శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని పి.టి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
- శాతవాహనుల మూలస్థానం పైఠాన్ ప్రాంతమని డాక్టర్ కె.గోపాలచారి పేర్కొన్నారు.
- శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యువులని డాక్టర్ కె.గోపాలచారి వాదించారు.
- ఏటూరి బలరామమూర్తి ప్రకారం కరీంనగర్ జిల్లాలోని మహానగర శిథిలాలు కదంబపూర్లో బయల్పడ్డాయి.
- వాయుపురాణం ప్రకారం 15 మంది శాతవాహన రాజులు పాలించారు.
- మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు పాలించారు.
- నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు గోబద.
- శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి రాజు శ్రీముఖుడు.
- సాతవాహనుడే శ్రీముఖడని, ఇతడే శాతవాహన వంశ మూలపురుషుడని, తొలి రాజు అని నాణేల ఆధారంగా పరిశోధకుడు డాక్టర్ డి.రాజారెడ్డి పేర్కొన్నారు.
- శ్రీముఖుడు తొలుత జైనమతం అవలంబించారు. జైన గురువు కాలకసూరి.
- పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో శుంగ వంశాన్ని స్థాపించే సమయంలో మొదటి శాతకర్ణి పాలన కొనసాగిస్తున్నారు.
- రాప్సన్, బారువా అనే చరిత్రకారులు వైన్‌గంగా నదిని కణ్ణబెణ్నా నది అని అన్నారు.
- నానాఘాట్ శాసనం దేవి నాగానిక వేయించారు. ఈ శాసనంలో మొదటిశాతకర్ణిని దక్షిణాపథపతి అని వర్ణించారు.
- మొదటిసారిగా వైవాహిక సంబంధాల ద్వారా మొదటి శాతకర్ణి రాజ్యాన్ని విస్తరించారు.
- మొదటి శాతకర్ణి ఖారవేలునిపై దండెత్తి, ఓడించి తన రాజ్యాన్ని తూర్పుదిశకు విస్తరించాడని చుళ్లకలింగ జాతకం తెలుపుతుంది.
- శాతవాహనుల్లో మొదటిసారిగా మొదటి శాతకర్ణి యాగాలు చేశాడు.
- మొదటి శాతకర్ణికి అస్మాకదీశ, అప్రహతిచక్ర, దక్షిణపథాపతి అనే బిరుదులు ఉన్నాయి.
- దేవి నాగానికి బిరుదులు యజ్ఞ హుతన సుంగదయా, దిగవ్రత సుంధయ.
- వేదసిరిని పూర్ణోత్సంగుడు అని కూడా అంటారు.
- రెండో శాతకర్ణి మగధ, కళింగలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని యుగపురాణంలో ఉంది.
- సాంచీస్థూప దక్షిణద్వారంపై శాసనాన్ని చెక్కించిన వాసిష్టిపుత్ర ఆనందుడు రెండో శాతకర్ణి ఆస్థానంలోని వాడు.
- సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని రెండో శాతకర్ణి నిర్మించారు.
- లంబోదరుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహన రాజ్య భాగాలను ఆక్రమించారు.
- బృహత్కథ, వాత్స్యాయన కామసూత్రాలు, కావ్య మీమాంసల్లో కుంతల శాతకర్ణి ప్రశంస కనిపిస్తుంది.
- శర్వవర్మ, గుణాఢ్యుడు కుంత శాతకర్ణి ఆస్థానంలోని వారు.
- ప్రాకృతభాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా కుంతల శాతకర్ణి ప్రకటించారు.
- హాలుడు కూర్చిన గ్రంథం గాథా సప్తశతి.
- శ్రీలంక రాకుమారి లీలావతిని హాలుడు పెళ్లి చేసుకున్నాడు.
- త్రిసముద్ర తోయ పీతవాహనుడు అని బిరుదు గలరాజు గౌతమీపుత్ర శాతకర్ణి.
- గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది.
- గౌతమీబాలశ్రీ నాసిక్ శాసనం వేయించారు.
- గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు కొండాపూర్, పెద్దబంకూర్, జోగల్తంబీ వద్ద లభించాయి.
- నహపానుడిపై విజయం సాధించి అతని నాణేలపై తన పేరుతో నాణేలు పునర్ముద్రించిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి.
- క్రీ.శ.78వ సంవత్సరాన్ని శాలివాహన శకంగా ప్రకటించిన వారు గౌతమీపుత్ర శాతకర్ణి.
- రాజ్యంలో బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టి చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేసిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి.
- రాజ్యంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి.
- ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించారు.