బ్రహ్మ యొక్క కమండలం నుండి గంగా నది జన్మించిందని అంటారు. ఆమెను పార్వతి దేవి సోదరిగా ఎందుకు భావిస్తారు. గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా నిర్వహించుకుంటారు. ఈపండుగను వైశాఖ మాసంలోని ఏడో రోజున నిర్వహించుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజున గంగా మాత బ్రహ్మ కమండలం నుండి జన్మించిందని చెప్పుకుంటారు. ఈ సంవత్సరంగంగా సప్తమి మే 14న వచ్చింది.
గంగా దేవి జననం గురించి అనేక ప్రసిద్ధకథలు ఉన్నాయి. వామన పురాణం ప్రకారం, విష్ణువు వామనుడి రూపంలో తన ఒక పాదాన్ని ఆకాశం వైపు ఎత్తినప్పుడు, బ్రహ్మదేవుడు అతని పాదాలను నీటితో కడిగేందుకు తన కమండలాన్ని నీటితో నింపాడు. గంగా దేవి బ్రహ్మదేవుని కమండలంలోనే జన్మించినట్టు చెబుతారు. బ్రహ్మదేవుడు గంగా దేవిని హిమాలయ రాజుకు అప్పగించాడు. అప్పటి నుంచి గంగాదేవిని, పార్వతీదేవిని సోదరీమణులుగా భావిస్తారు.
గంగా పూజ మంత్రం: ఓం నమో గంగా విశ్వరూపిని నారాయణీ నమో నమః
గంగా గంగేటి యో బ్రుయత్, యోజననం శతృపి. ముచ్యాతే సర్వపప్యాభ్యో, విష్ణులోకే స గచ్చ్తీ.