బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ 9తో పదిహేనో వారం మొదలైంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈ వారంతో ముగియనుంది. ఈ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇక ఈ షో ముగింపు దశకు రావడంతో బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ 5 ఫైనలిస్టుల గెలుపు కోసం, తమ ఫేవరేట్ సెలబ్రెటీని నిలబెట్టే ఓట్ల కోసం బాగా కష్టపడుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఫైనలిస్టులు:
1.నిఖిల్
2.ప్రేరణ
3.అవినాష్
4.నబీల్ అఫ్రిది
5.గౌతం కృష్ణ ఉన్నారు.
Also Read:-దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు: మోహన్ బాబు ఇంటికి పోలీసులు.. పెదరాయుడి స్టేట్మెంట్ ఇది..!
ఈ ఐదురుగు కంటెస్టెంట్స్ పద్నాలుగు వారాలుగా తమ ఆటతో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అయితే ఇందులో ఓ ముగ్గురు మాత్రమే ప్రేక్షకుల ఉత్సహాన్ని మరియు సోషల్ మీడియా ట్రెండ్‌ల ఆధారంగా టాప్ 3లో నిలిచినట్లు సమాచారం. వారిలో నిఖిల్, గౌతం కృష్ణ, నబీల్ అఫ్రిది ఉన్నారు. అయితే వీరిలో ముఖ్యంగా ఆట ఆడే విధానం, వారి వ్యక్తిత్వాలు మరియు ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ ఇవే పోటీలో నిలబెట్టాయి.
🌟 Congratulations to the Top 5 finalists of the Bigg Boss house! The race to the grand finale begins! 🏆🔥#BiggBossTelugu8 #StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/qpI1jM0yWO
— Starmaa (@StarMaa) December 9, 2024
ఏదేమైనప్పటికీ.. బిగ్ బాస్ టైటిల్ కోసం అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇంకాస్త ముందుకు వెళ్లి టాప్2 కంటెస్టెంట్స్ ఎవరనేది చూస్తే.. అందులో నిఖిల్ మరియు గౌతమ్ కృష్ణ. ఈ ఇద్దరి మధ్యే యుద్ధం సాగనుంది. ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ట్రెండ్‌లు మరియు ప్రేక్షకుల అంతిమ ఎంపికపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
ఇకపోతే బిగ్‌బాస్ సీజన్ 8 ప్రైజ్‌మనీ ఎంతన్నది సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేశాడు. ప్రస్తుతం 54 లక్షల 30 వేల ప్రైజ్‌మనీ ఉందని చెప్పాడు. కానీ, గ్రాండ్ ఫినాలే వరకు అది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని విషయాన్ని వెల్లడించాడు, ఇక గెలిచిన కంటెస్టెంట్కి కారు కూడా గిఫ్ట్గా ఉంటుందని నాగార్జున తెలిపాడు.