రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో జమ్మూ మరియు కాశ్మీర్ బౌలర్లు ఔరా అనిపించారు. ప్రత్యర్థి జట్టులో ఆరేడుగురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నా.. 120 పరుగులకే కుప్పకూల్చారు. ముంబై బ్యాటర్లలో శార్దూల్ ఠాకూర్(51) ఒక్కడు రాణించాడు. మిగిలిన వారంతా విఫలం.
రోహిత్ ఫ్లాప్ షో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్లాప్ షో దేశవాళీ క్రికెట్‌లోనూ కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో విఫలమైన రోహిత్ ఇక్కడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముచ్చటగా 3 పరుగులు చేశాడు. మొత్తంగా 19 బంతులు ఆడిన హిట్ మ్యాన్.. తొలి బంతి నుంచే తడబడుతూనే వచ్చాడు. ఆ ప్రయత్నంలోనే జమ్మూ పేసర్ ఉమర్ నజిర్ మీర్ వేసిన బౌన్సర్‌కు చిక్కాడు.
ALSO READ | IND vs ENG: ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. RCB ఫ్యాన్స్‌ను ఇలా ట్రోల్ చేస్తున్నారేంట్రా
రోహిత్ ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్(4), ముంబై కెప్టెన్ అజింక్యా రహానే(12), వన్ డౌన్ బ్యాటర్ హార్దిక్ టామోర్(7) నలుగురిని ఉమర్ నజిర్ పెవిలియన్ చేర్చాడు. అతని ధాటికి ముంబై ఒకానొక దశలో 47 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో శార్దూల్ ఠాకూర్(51), తనుష్ కొటియాన్(26) ఆదుకున్నారు. మరో అంతర్జాతీయ స్టార్ శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులు చేశాడు.
Selfless Rohit Sharma getting out early to let youngsters spend time in the middle ❤️pic.twitter.com/o1CXQnqEiD
— Dinda Academy (@academy_dinda) January 23, 2025
ఎవరీ ఉమర్ నజీర్ మీర్..?
పుల్వామాకు చెందిన ఉమర్ నజీర్ మీర్ అడ్వాంటేజ్.. అతని ఎత్తు. 6 అడుగుల 4 అంగుళాల పొడవుండే నజీర్..అలవోకగా బౌన్సర్లు వేయగలడు. అదే అస్త్రాన్ని ముంబైపై ప్రయోగించాడు. 2013లో దేశవాళీ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఇతడు.. ఇప్పటివరకూ 57 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 138 వికెట్లు తీశాడు. ఇక లిస్ట్ ఎ క్రికెట్‌లో 54 వికెట్లు, టీ20ల్లో 32 వికెట్లు పడగొట్టాడు.
ఉమర్ నజీర్ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన.. గతేడాది సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో వచ్చింది. ఆ మ్యాచ్‌లో 53 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ స్పీడ్ గన్ తన చివరి మూడు రంజీ మ్యాచ్‌ల్లో 9.81 సగటుతో 11 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు 2.64