ఏడేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహనికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. నయన్ కి ప్రేమికుడిగా, ఓ దర్శకుడిగా మాత్రమే విఘ్నేష్ అందరికీ సుపరిచితుడు. కానీ అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నయన్‌కి విఘ్నేష్ పెద్ద అభిమాని. అమె కంటే అతను వయసులో ఒక ఏడాది చిన్న కూడా.. విఘ్నేష్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్. పాటల రచయతగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. తమిళ్ లో 50 కి పైగా పాటలు రాశారు. పలు ఆల్బమ్స్ కి మ్యూజిక్ కూడా చేశాడు. 2012లో శింబు హీరోగా వచ్చిన పోడా పోడి సినిమాకి విఘ్నేష్ కు మొదటిది. అతని రెండో సినిమా అయిన ’నానుమ్ రౌడీదాన్’ సినిమాలో తొలిసారి నయన్ నటించింది.
ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ లో విఘ్నేష్ చిన్న పాత్రని పోషించాడు. అతను డిస్ట్రిబ్యూటర్ గా కూడా పలు సినిమాలకి పనిచేశాడు. విఘ్నేష్ కు అనిరుథ్ బెస్ట్ ఫ్రెండ్. విఘ్నేష్ డైరెక్ట్ చేసిన చాలా సినిమాకు అనిరుథ్ సంగీతం అందించాడు. డైరెక్టర్‌గా ‘పోడా పోడి’. నానుమ్ రౌడీ దాన్’, తానా సెరినా కొట్టం’ పావ కాదయిగల్’ కాతు వాకుల రెండు కాదల్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు.
కాతు వాకుల రెండు కాదల్ ఇటీవలే రిలీజ్ అయింది. నయనతార, సమంత హీరోయిన్స్‌గా నటించగా విజయ్ సేతుపతి హీరోగా నటించాడు.