అఖిల్కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..

అఖిల్కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా, చడీచప్పుడు లేకుండా ఉన్నట్టుండి నిశ్చితార్థం జరిగింది. నాగార్జున, అఖిల్ ఫొటోలు షేర్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. అక్కినేని కుటుంబం అధికారికంగా ప్రకటించడంతో జైనాబ్ రవ్జీ, అఖిల్ అక్కినేని త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయింది. 

తాజాగా తెలిసిన మరో విషయం ఏంటంటే.. ఈ జైనాబ్ రవ్జీ.. అదేనండీ అఖిల్ కాబోయే భార్య తండ్రి.. అఖిల్కు పిల్లనిస్తున్న మామది చిన్నాచితక బ్యాక్ గ్రౌండ్ కాదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్లకు పడగలెత్తిన పెద్ద మనిషి. రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేసినట్లు తెలిసింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆల్మోస్ట్ ఒక కేబినెట్ మినిస్టర్ ర్యాంకు పదవి జగన్ ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. జుల్ఫీ రవ్జీని నవంబర్ 13, 2019న ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం అప్పట్లో జీవో కూడా జారీ చేసింది. అఖిల్కు జుల్ఫీ రవ్జీ కుమార్తెతో నిశ్చితార్థం అయిందని తెలియగానే వైసీపీ సోషల్ మీడియా పేజెస్లో కూడా ఆయన గురించి, ఆయనకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రియారిటీ గురించి పోస్టులు షేర్ అవుతున్నాయి.  ZR Renewable Energy Pvt Ltd సంస్థకు చైర్మన్, ఎండీగా జుల్ఫీ రవ్జీ కుమారుడు జైన్ రవ్జీ వ్యవహరిస్తున్నారు.

జుల్ఫీ రవ్జీకి జగన్ ప్రభుత్వంలో దక్కిన సౌలభ్యాలివి..
* కారు, ల్యాప్ టాప్, మూడు లక్షలు విలువ చేసే ఫర్నిచర్
* లక్షన్నర విలువ చేసే కిచెన్ సామగ్రి
* మంత్రులకు ఇచ్చే మెడికల్ రీయింబర్స్మెంట్
* ఒక ప్రైవేట్ సెక్రటరీ, మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ
* ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక జమేదార్,
* ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్ కనెక్షన్లు

జగన్ ప్రభుత్వం అప్పట్లో విడుదల చేసిన జీవో ప్రకారం.. జుల్ఫీ రవ్జీ తండ్రి పేరు అబ్దుల్లా రవ్జీ. రోడ్ నెంబర్.7, బంజారాహిల్స్, హైదరాబాద్లో ఆయన నివాసం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం ఎంత పెద్దదో, గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో నాగార్జునకు కాబోయే వియ్యంకుడు జుల్ఫీ రవ్జీ అంత తోపు. అక్కినేని అఖిల్కు పిల్లనిచ్చే మామంటే ఈమాత్రం ఉంటదంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ALSO READ | నాని సినిమాలో విలన్ గా సీనియర్ హీరో.?