కరోనా మళ్లీ వచ్చింది. 84 దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. WHO హెచ్చరించింది. 2024. ఆగస్ట్ రెండు వారాల్లో కేసులు సంఖ్య.. సాధారణం కంటే 20 శాతం పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు.. పారిస్ ఒలింపిక్స్ లో 40 మంది అథ్లెట్లు కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించి.. కలకలం రేపింది.
కోవిడ్ టెస్టులు చేస్తే 10శాతం పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని WHO డాక్టర్ వాన్ కెర్ఖోవ్ జెనీవాలోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలింది. కరోనా కేసుల పాజిటివిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందన్నారు. ఈసారి తీవ్రమైన పరిణామాలు వస్తాయని ఆమె అన్నారు.
WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికా, యూరప్ మరియు పశ్చిమ పసిఫిక్‌లలో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. గత 18 నెలలుగా కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత బాగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్ఖోవ్ చెప్పింది. కోవిడ్ 19ని ఈ సారి సమర్థవంతంగా ఎదుర్కోడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.