మా బాధ మీకేం తెలుసు? : వెంకటేశ్,  నాగర్​కర్నూల్​ జిల్లా

పరీక్ష పేపర్లు లీక్ చేసే మూర్ఖులారా.. మా నిరుద్యోగుల బాధ మీకేం తెలుసు. నా పుస్తకాలను అడుగు ఒక్కొక్క పేజీని ఎన్ని సార్లు చదివానో, నా చెప్పులను అడుగు ఎన్నిసార్లు లైబ్రరీల చుట్టూ తిరిగానో, నా ఖాళీ కడుపును అడుగు ఎన్ని సార్లు కోచింగ్ సెంటర్​లో అర్ధాకలితో కూర్చున్నానో, నా కండ్లనడుగు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా పుస్తకాలతో జాగారం చేశానో, నా మనసును అడుగు ఎన్ని పండుగలను వదులుకొని ఒంటరిగా కిరాయి రూమ్​లో అనాథగా బతికానో, నా గది మెట్లను అడుగు ఎన్ని సార్లు తడపడుతూ పైకి ఎక్కానో, నా ఊపిరిని అడుగు ఎన్ని సార్లు వదులుకోవాలని ప్రయత్నించి.. అమ్మానాన్నలు యాదికొచ్చి ఆగానో, నా చేతులను అడుగు రాసిన వాక్యాన్ని.. చేసిన లెక్కను ఎన్ని సార్లు చేశానో, నా పగవాళ్లను అడుగు నేను తడబడుతున్న వేల సార్లు నన్నుచూసి ఎంత ఆనందంతో నవ్వుకున్నారో, నా ఒక్క మార్కును అడుగు ఎన్ని సార్లు నన్ను ఈ పోటీ ప్రపంచం నుంచి దూరంగా విసిరేసిందో, నా ఏటీఎం కార్డును అడుగు నాన్న పంపిన డబ్బులు తియ్యడానికి.. తినడానికి ఎన్ని సార్లు సచ్చిబతికానో, నా భుజాలపైన దురదృష్టం ఎక్కి కూర్చుంటే.. నేను ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాణించినా వ్యర్థమేనేమో! కానీ కోరిక చావడం లేదు ఆశ తీరడం లేదు. నిరుద్యోగుల, ఉద్యోగార్థుల భవిష్యత్తును స్వార్థం కోసం అంగట్లో సరుకులా అమ్మే దుర్మార్గులారా.. మా ఆకలి కేకలు ఒకసారి వినండి!.- వెంకటేశ్, 
నాగర్​కర్నూల్​ జిల్లా