మరో ఇద్దరికి వైరస్ సోకినట్టు అనుమానం
వాళ్ల కాంటాక్టులు ట్రేస్ చేస్తున్న ఆరోగ్య శాఖ
బుధవారం రాత్రి వరకు 43 మంది గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు కేవలం ఒక్క వ్యక్తికే వైరస్ నిర్ధారణ అయినా ఇంకో ఇద్దరికీ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వీళ్లలో ఒకరు అపోలో హాస్పిటల్ హౌజ్ కీపింగ్ వర్కర్. వైరస్ సోకిన వ్యక్తితో ఈమె సన్నిహితంగా మెలిగినట్టు తెలిసింది. మరొకరు రెండు వారాల క్రితం ఇటలీ వెళ్లొచ్చిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. వీళ్లిద్దరూ రెండ్రోజుల క్రితం గాంధీలో చేరారు. ప్రస్తుతం అక్కడే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు గాంధీలో చేరకముందు వీరిద్దరితో కాంటాక్టయిన వాళ్ల వివరాలను ఆఫీసర్లు ట్రేస్ చేస్తున్నరు. బుధవారం రాత్రి వరకు 43 మందిని ట్రేస్ చేశారు. వీళ్లందరికీ ఫోన్లు చేసి
హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించామని, ట్రేసింగ్ ఇంకా సాగుతోందని అధికారులు తెలిపారు.