కలుషితమైన, అసురక్షిత ఆహారాన్ని తినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల పేర్కొంది. WHOలోని ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్, బాధిత వ్యక్తులలో 40 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లలేనని, వారు ఇప్పటికే పోషకాహార లోపం మరియు అసురక్షిత ఆహారం కారణంగా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఏటా జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.6 మిలియన్ల మంది ప్రజలు కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని సైమా వాజెద్ తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024 థీమ్ 'ఊహించని వాటికి సిద్ధం'
ప్రపంచ వ్యా్ప్తంగా కల్తీ ఆహారాన్ని అరికట్టడానికి అనేక సంస్థలు పని చేస్తున్నాయి. ఫుడ్ కలుషితం అవుతున్న దేశాల్లో ఆఫ్రికా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం ఆగ్నేయాసియా రెండవదని సైమా వాజెద్ తెలియజేశారు . దీనికి ప్రధాన కారణాలలో ఒకటి ఉష్ణమండల వాతావరణం, ఇది వాతావరణ మార్పుల ప్రభావాలతో పాటు తెగుళ్లు, టాక్సిన్స్ కారణంగా జరుగుతుందని తేలింది. కలుషిత ఆహారాలను అరికట్టడానికి ప్రభుత్వాలని ప్రోత్సహించాలని వారు గట్టగా చెప్తున్నారు.