వూహాన్ ల్యాబ్ నుంచి కాదు.. ఆస్ట్రేలియా బీఫ్‌‌‌‌‌‌‌‌ నుంచే కరోనా!

  • వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యా బ్‌ నుంచి వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేదు: డబ్ల్యూహెచ్ఓ టీమ్‌

న్యూఢిల్లీ: కోల్డ్‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తుల ద్వారా కరోనా వ్యాపించి ఉండొచ్చని ఇదివరకు చెప్పిన డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో టీమ్‌‌‌‌‌‌‌‌.. తాజాగా ఆస్ట్రేలియా బీఫ్‌‌‌‌‌‌‌‌ లాంటి ఉత్పత్తుల నుంచి వైరస్‌‌‌‌‌‌‌‌ వచ్చి ఉండొచ్చని చెప్పింది. దీనిపై పరిశోధన చేయాల్సి ఉందని తెలిపింది. కరోనా సోర్స్‌‌‌‌‌‌‌‌పై చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో టీమ్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ పీటర్‌‌‌‌‌‌‌‌ ఎంబరేక్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ నుంచి కరోనా వ్యాపించే అవకాశం చాలా తక్కువని చెప్పారు. ఆ దిశగా ఇక పరిశోధనలు కూడా ఉండబోవని స్పష్టం చేశారు. వైరస్‌‌‌‌‌‌‌‌ చైనాలో పుట్టలేదని, వేరే దేశం నుంచి తమ దేశానికి వచ్చి వుహాన్‌‌‌‌‌‌‌‌లో తొలికేసు నమోదైందని చాలాకాలంగా చైనా వాదిస్తోంది. తాజాగా అదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో చెప్పింది.

బ్రిటన్‌‌‌‌‌‌‌‌ కెంట్‌‌‌‌‌‌‌‌ వేరియంట్‌‌‌‌‌‌‌‌ చాలా డేంజర్‌‌‌‌‌‌‌‌

బ్రిటన్‌‌‌‌‌‌‌‌లోని కెంట్‌‌‌‌‌‌‌‌లో కనుగొన్న కరోనా వైరస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని కొవిడ్‌‌‌‌‌‌‌‌ 19 జీనోమిక్స్‌‌‌‌‌‌‌‌ యూకే కన్సార్షియం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ షారోన్‌‌‌‌‌‌‌‌ పీకాక్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. ప్రస్తుత కొవిడ్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్లకూ లొంగకుండా మారే అవకాశమూ ఉందన్నారు. బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో ఈ కొత్త వేరియంట్ బలంగా ఉందని, క్రమంగా ప్రపంచమంతా వ్యాపించొచ్చని చెప్పారు.

For More News..

16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ పాపకు అండగా మోదీ

అర ఎకరంతో మొదలుపెట్టి.. 15 ఎకరాల్లో పూల సాగు చేస్తున్న టెన్త్ డిస్‌కంటిన్యూ స్టూడెంట్

తండ్రి రాజ్యసభ సభ్యుడు, కొడుకు కార్పొరేషన్ చైర్మన్, కూతురు మేయర్