ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ప్రపంచమంతా చేసుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 16న వచ్చింది. మనదేశంతో పాటు 80 దేశాలు ఇదే రోజున ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ, మరికొన్ని దేశాలు వేరే తేదీల్లోఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఆ దేశాలు ఏవి? ఎందుకు ఆ దేశాల్లో డేట్ మారింది? ఆ వివరాలే ఇవి.
వా షింగ్టన్కి చెందిన సొనొరా లూయీస్ స్మార్ట్ డొడ్ ఫాదర్స్‌డేని మొదలుపెట్టింది. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్. ప్రసవ సమయంలో సొనొరా తల్లి చనిపోయింది. దాంతో అప్పటినుంచి ఆమెను, ఆమె ఐదుగురు సోదరులను తండ్రి ఒక్కడే పెంచాడు. 1909వ సంవత్సరంలో మదర్స్‌డే నాడు తండ్రితో కలిసి సెంట్రల్ మెథడిస్ట్ చర్చ్‌కి వెళ్లింది. అక్కడ మదర్స్‌డే గురించి వింటున్నప్పుడు మిలిటరీలో పనిచేసిన తన తండ్రి ఒక్కడే తమ ఆరుగురిని పెంచాడు. అలాంటి తండ్రిని గౌరవించేందుకు ఒక రోజు లేకపోవడం బాధగా అనిపించింది.
అప్పుడు ఆమె ఫాదర్స్ డే ఆలోచన గురించి అక్కడి పెద్దలకు చెప్పింది. అలా1910లో సొనొరా తండ్రి పుట్టినరోజు అయిన జూన్ 5న ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అనుకుంది. కానీ ప్లానింగ్ చేయడం కష్టం కావడంతో అదే ఏడాది జూన్ 19 ఆదివారం నాడు సెలబ్రేట్ చేసింది. ఆమె ఆలోచన దేశం అంతా తెలిసింది. ఆ తరువాత ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసేందుకు 1921లో వర్జీనియాలో ఒక కమిటీ, 1936లో న్యూయార్క్ సిటీలో ఒక కమిటీ ఏర్పడ్డాయి.
1972లో ప్రెసిడెంట్ రిచర్డ్ డిక్సన్ జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డే నేషనల్ హాలీడేగా అధికారికం చేశారు. అలా మొదలైన ఫాదర్స్ డే తరువాత ఇతర దేశాలకు పాకింది. ఇండియాలో కూడా ఈ డేని పలురకాల ఈవెంట్లతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్రాన్స్‌లో అయితే తండ్రికి గిఫ్ట్ కార్డ్‌లు ఇస్తుంటారు. ఆ గిఫ్ట్స్‌లో స్పోర్ట్స్ ఐటెమ్స్, బట్టలు, స్వీట్స్, చాకొలెట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అవుట్ డోర్ కుకింగ్‌కి అవసరమైన వస్తువులు ఇస్తుంటారు.