ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా లో ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షవరకు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని.. సాధారణ వ్యాధిగా భావించరాదని హెచ్చరిస్తోంది. లేదంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకారిగా మారే ముప్పు ఉందని WHO టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ హెచ్చరించారు. ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువ అయినప్పటికీ అది తేలికపాటి వ్యాధి మాత్రం కాదన్నారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు మాత్రం అసలే కాదన్నారు. వృద్ధులు ఈ వేరియంట్ బారినపడితే తీవ్ర అనారోగ్య పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్ కేసులతో ఆస్పత్రులన్నీ నిండిపోయే ప్రమాదం ఉందని కేర్ఖోవ్ హెచ్చరించారు.
మరోవైపు.. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే.. ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదనే వాదన విన్పిస్తోంది. అలా అని నిర్లక్ష్యంగా కూడా ఉండరాదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
మరిన్ని వార్తల కోసం..