మూడు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం ఇక లాంఛనమే. అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు రూపకర్త.. మహిళల హక్కుల కోసం పోరాడిన మహిళా నేత గీతాముఖర్జీ గురించి తెలుసుకుందాం..
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం తెరపైకి వచ్చిన తర్వాత తరచుగా వినపడుతున్న పేరు గీతా ముఖర్జీ. మహిళల హక్కుల కోసం పోరాడిన దృఢ సంకల్పం కలిగిన మహిళా నేత. తొలిసారి లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన మహిళా ఎంపీ.. 1980 నుంచి 2000 వరకు ఏకంగా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైంది. అంతేకాదు 1967 నుంచి 1977 వరకు పశ్చిమ బెంగాల్ శాసన సభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రూపకల్పనలో గీతా ముఖర్జీ కీలక పాత్ర పోషించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో గీతా ముఖర్జీ సిఫార్సులు
గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీ 1996 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించి ఏడు సిఫార్సుల సమర్పించింది.
వీటిలో ఐదు 2008 మహిళా రిజర్వేషన్ బిల్లులో చేర్చబడ్డాయి.
>> ఆంగ్లో ఇండియన్లకు ఉప రిజర్వేషన్లు
>> లోక్ సభలో రాష్ట్రం మూడు సీట్లకంటే తక్కువ లేదా ఎస్సీ ఎస్టీ కి మూడు సీట్ల కంటే తక్కువ సీట్లు ఉన్న సందర్భాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం
>> ఢిల్లీ అసెంబ్లీకి రిజర్వేషన్
>> రిజర్వేషన్ పరిభాషను మూడవ వంతు కంటే తక్కువ కాకూడదు.. సాధ్యమైతే మూడవ వంతుకి మార్చడం.