న్యూయార్క్‌‌‌‌లో విమాన ప్రమాదం భారత సంతతి వైద్యురాలు మృతి.. ఆమె ఫ్యామిలీ కూడా దుర్మరణం

న్యూయార్క్‌‌‌‌లో విమాన ప్రమాదం భారత సంతతి వైద్యురాలు మృతి.. ఆమె ఫ్యామిలీ కూడా దుర్మరణం

న్యూయార్క్: న్యూయార్క్‌‌‌‌లో శనివారం మధ్యాహ్నం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి వైద్యురాలు డాక్టర్ జాయ్ సైనీతో పాటు ఆమె కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. క్యాట్స్‌‌‌‌కిల్స్ పర్వత ప్రాంతంలో బర్త్ డే సెలబ్రేషన్​తో పాటు వీకెండ్ ఎంజాయ్ చేద్దామని జాయ్ సైనీ ఫ్యామిలీ నిర్ణయించుకుంది.

ఏప్రిల్ 12న జాయ్ సైనీ, ఆమె భర్త డాక్టర్ మైఖేల్ గ్రాఫ్ (న్యూరోసైంటిస్ట్), కూతురు కరెన్నా గ్రాఫ్, కొడుకు జారెడ్ గ్రాఫ్, వారి బంధువులు అలెక్సియా, జేమ్స్ సాంటోరో.. న్యూయార్క్‌‌‌‌ వైట్ ప్లెయిన్స్‌‌‌‌లోని వెస్ట్‌‌‌‌చెస్టర్ కౌంటీ ఎయిర్ పోర్టు నుంచి క్యాట్స్‌‌‌‌కిల్స్​కు ప్రైవేట్ ప్లేన్​లో బయలుదేరింది. అయితే, టేకాప్ అయిన కాసేపటికే విమానం క్రారీవిల్లె సమీపంలో కుప్పకూలిందని నేషనల్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌‌‌‌టీఎస్‌‌‌‌బీ) వెల్లడించింది. ప్లేన్ వేగంగా నేలకు ఢీకొని పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది.