ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు..? ఆ ఐదుగురిలో.. నెంబర్ వన్ ఇతనే..!

ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు..? ఆ ఐదుగురిలో.. నెంబర్ వన్ ఇతనే..!

ఢిల్లీ రాష్ట్రం బీజేపీ వశం అయ్యింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీని దక్కించుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈ గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు మంచి బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు.. రేసులో ఎవరు ఉన్నారు అనేది చూద్దాం..

1. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ :

పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. బీజేపీ కీలక నేత. ఆప్ అగ్రనేత కేజ్రీవాల్ ను గట్టిగా ఢీకొట్టిన లీడర్ గా పేరుంది. న్యూ ఢిల్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ ను ఓడించారు. 3 వేల 182 ఓట్లతో కేజ్రీవాల్ పై గెలిచారు. ఇతను ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఇతను. సీఎం రేసులో ఉన్న మొదటి వ్యక్తి ఇతనే. ఆప్ పార్టీని ఛాలెంజ్ చేసి.. కేజ్రీవాల్ పై పోటీ చేసి మరీ గెలిచి.. ఢిల్లీ సీఎం రేసులో మొదటి స్థానంలో ఉన్నారు పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ.

2. రమేష్ బిదూరి :

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీనే రమేష్ బిదూరి. ఇతను కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది. మొదటి నుంచి బీజేపీ పార్టీలోనే ఉన్నారు. సంఘ్ పరివార్ తో గట్టి అనుబంధం ఉంది. ఢిల్లీ సీఎం ఆతిశీపై పోటీ చేశారు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన రమేష్ బిదూరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల హెడ్ లైన్స్ లో ఉంటుంటారు. ప్రియాంక గాంధీ, ఆతిశీలపై ఈ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైలెట్ అయ్యారు. ఢిల్లీ సీఎం రేసులో గట్టిగా వినిపిస్తున్న పేర్లలో రమేశ్ బిదూరి ఒకరు. కాకపోతే ఓడిపోవటం అనేది ఆయన కొద్దిగా మైనస్. అయినా సంఘ్ పరివార్ నుంచి గట్టి మద్దతు అతని ప్లస్ కాబోతున్నది. 

Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

3. బన్సూరి స్వరాజ్ : 

ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తెనే బన్సూరి స్వరాజ్. న్యూ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. లాయర్ కూడానూ. అధిష్ఠానం దగ్గర మంచి పరిచయాలు ఉన్నాయి. మోదీ, అమిత్ షాతో ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అంశం. ఢిల్లీ సీఎంగా మహిళను చేయాలి అనుకుంటే మాత్రం పరిశీలించే పేర్లలో బన్సూరి స్వరాజ్ ఒకరు. 

4. స్మృతి ఇరానీ :

మాజీ కేంద్ర మంత్రి స్పృతి ఇరానీ పేరు కూడా ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న పేర్లలో ఒకరు. మాజీ ఎంపీ. రాహుల్ గాంధీని 2019 ఎన్నికల్లో ఓడించారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఓడిపోయారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బాగా పని చేశారనే పేరు ఉంది. మీడియాలో కాకుండా గ్రౌండ్ వర్క్ చేశారని నేతలు చెబుతున్నారు. మోదీకి దగ్గర వ్యక్తి. హైకమాండ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న పేర్లలో స్మృతి ఇరానీ ఒకరు.

5. దుష్యంత్ గౌతమ్ :

దుష్యంత్ గౌతమ్ బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దళిత నాయకుడిగా పేరుంది. ఈ ఎన్నికల్లో కరోల్ బాగ్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన దుష్యంత్ కుమార్ గౌతమ్.. ఆప్ అభ్యర్థి విశేష్ రవి చేతిలో ఓడిపోయారు. ఇది ఆయన మైనస్ పాయింట్. ఇదే సమయంలో దళిత నాయకుడిగా.. బీజేపీ పొలిట్ బ్యూరోలో మంచి పట్టున్న నేత. ఇది ప్లస్ అయినా.. ఓడిపోవటం అనేది మైనస్. దళిత లీడర్ నుంచి చూస్తే అతనికే ప్రయార్టీ ఉంటుంది అంటున్నారు.