తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 17 పార్లమెంట్.. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లలో సిబ్బందిని తరలించారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
కొడంగల్ లోని పోలింగ్ స్టేషన్ 237లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు . సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉదయం 11 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మాజీ సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. సిద్దిపేట భరత్ నగర్‌లో ఓటు వేయనున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు. పూడూరులోని జిల్లా పరిషత్ హై స్కూలులో సోమవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మల్కాజ్‌గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.
రేపు హైదరాబాద్ లోని పలు పోలింగ్ బూత్ లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సినీ ప్రముఖులు. ఓబుల్ రెడ్డి హైస్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ సెంటర్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్ ఫ్యామిలీ ఓటు వేయనుంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేశ్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఓటు వేయనున్నారు.
FNCCలో రాఘవేంద్రరావు, విశ్వక్ సేన్, దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు.. జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవిఫ్యామిలీ ఓటు వేయనుంది. జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ ఓటు వేయనున్నారు. మణికండ హై స్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేటలో రాజమౌలిదంపతులు ఓటేయనున్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో నాని, దర్గా గవర్నమెంట్ ప్రైమరీ హైస్కూల్ లో సుధీర్ బాబు, రోడ్ నెంబర్ 45లో అల్లరి నరేశ్, యూసుఫ్ గూడ చెక్ పోస్టులో తనికెళ్ల భరణి ఓటు వేయనున్నారు.