
న్యూఢిల్లీ: దేశ హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ ఈ ఏడాది మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగొచ్చింది. తయారీ రంగ ప్రొడక్ట్‌లు, క్రూడ్ పెట్రోలియం ధరలు దిగిరావడంతో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే డబ్ల్యూపీఐ ఇండెక్స్ మార్చిలో 1.34 శాతంగా రికార్డయ్యింది. డబ్లూపీఐ వరసగా పదో నెలలోనూ తగ్గడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ 3.85 శాతంగా, కిందటేడాది మార్చిలో 14.63 శాతంగా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ మాత్రం 5.48 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 3.81 శాతంగా ఉంది. గోధుమ, పప్పుల ధరలు మార్చిలో పెరగగా, కూరగాయలు, నూనె గింజల ధరలు తగ్గాయి.