4 నెలల గరిష్టానికి హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌

4 నెలల గరిష్టానికి  హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌

న్యూఢిల్లీ:  ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో హోల్‌‌సేల్ ధరలను కొలిచే హోల్‌‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. అంతకు ముందు నెలలో 1.84 శాతంగా నమోదైన డబ్ల్యూపీఐ, అక్టోబర్‌‌‌‌లో  2.36 శాతానికి పెరిగింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌లో హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ మైనస్ 0.26 శాతంగా రికార్డ్ అయ్యింది.

ప్రభుత్వ డేటా ప్రకారం, ఆహార పదార్ధాల ధరలను కొలిచే ఇన్‌‌ఫ్లేషన్ కిందటి నెలలో 13.54 శాతానికి చేరుకుంది. అంతకు ముందు నెలలో ఇది 11.53 శాతంగా  ఉంది. కూరగాయల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. ముఖ్యంగా బంగాళదుంపలు, ఉల్లిపాయల రేట్లు  ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌‌లో  హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ గరిష్టంగా 3.43 శాతానికి చేరుకుంది.