న్యూఢిల్లీ: హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) కిందటి నెలలో మూడు నెలల కనిష్టమైన 2.04 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో 3.36 శాతంగా రికార్డయ్యింది. ఇది అప్పుడు 16 నెలల గరిష్టానికి సమానం. ఆహార పదార్థాల ధరలు బాగా తగ్గడంతో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ దిగొచ్చింది.
ఆహార పదార్థాల ధరలను కొలిచే ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ జూన్‌లో 10.87 శాతం ఉండగా, జులైలో 3.45 శాతానికి తగ్గింది. కిందటి నెలలో కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు ధరలు తగ్గగా, బంగాళదుంపలు, పండ్ల ధరలు పెరిగాయి. తయారీ ప్రొడక్ట్‌లు, ఫ్యూయల్, పవర్ ధరలు కిందటేడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో కొద్దిగా పెరిగాయి.