మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్  రైళ్లపై ఎందుకు లేదు.. అప్‌డేట్ కాలేదా లేక..?

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్  రైళ్లపై ఎందుకు లేదు.. అప్‌డేట్ కాలేదా లేక..?

ప్రపంచవ్యాప్తంగా జూలై 19న కొన్ని గంటలపాటు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్లు డౌన్ అయ్యాయి. పలు ఎయిర్ పోర్లు, బ్యాకింగ్ సంస్థలు, స్టాక్ ఎక్క్సేజ్ మార్కెట్ల సేవలు నిలిచిపోయాయి. ఫ్లైట్ క్యాన్సల్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ కు క్రౌడ్ స్ట్రైక్ అనే సెక్యురిటీ సంస్థ పంపిన అప్ డేట్ కారణంగా సర్వీసులో  అంతరాయం ఏర్పడింది.

అయితే ఈ ప్రభావం ఇండియన్ రైల్వే సర్వీస్ పై మాత్రం ఏమాత్రం లేదని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ లో బుకింగ్ కౌంటర్లలో టికెట్లు ఇవ్వడానికి 1999 లో డెవలప్ చేసిన CRIS ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను వాడుతున్నారట. 1999 నుంచి అదే CRIS సిస్టమ్ ను అప్ డేట్ చేస్తూ ఇప్పటీకి వాడుతున్నాట. దీని కారణంగానే రైల్వే సర్వీసులపై మైక్రోసాఫ్ట్ క్రాష్ ప్రభావం పడలేదని చెప్తున్నారు అధికారులు.